హెచ్-4 వీసాలపై వెనక్కి తగ్గేది లేదు
హెచ్-1బి వీసాలపై వచ్చినవారి జీవిత భాగస్వాములకు ఉద్యోగాన్ని అధీకృతం చేయడానికి ఉద్దేశించిన హెచ్-4 వీసా నిబంధనను రద్దు చేయాలన్న ఉద్దేశాన్ని అమెరికా ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఇది భారతీయ అమెరికన్ మహిళలపై పెద్ద ప్రభావం చూపించే పరిణామం. ఉద్యోగ ఆధారిత వలసల కార్యక్రమాన్ని సంస్కరించి, అమెరికా ప్రజలకు ఎక్కువగా లబ్ధి కలిగేలా చేయడమే తమ ఉద్దేశమని వలస సేవల విభాగం అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు హెచ్-4 నిబంధనను రద్దు చేయవద్దంటూ అనేకమంది భారతీయ అమెరికన్లు న్యూయార్క్లో చట్టసభ సభ్యులను కలిసి విన్నవించారు.













