తూర్పు యూరోపులో మొట్ట మొదటి సరిగా తెరాస పోలాండ్ శాఖ ఆవిర్భావం
దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో పాలుగొనడానికి వచ్చిన తెరాస ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగలను తూర్పు యూరోపులోని పోలాండ్ తెలంగాణ వాసులు వారి దేశానికి రావాల్సిందిగా కోరారు. పోలాండ్ వెళ్లి వాళ్ళ కోరిక మేరకు తెరాస పోలాండ్ శాఖని ప్రారంబించారు. మహేష్ వారికీ కండువా కట్టి పార్టీలోకి ఆహ్వానించారు. కొందరు ఆంధ్రావాళ్ళు కూడా సీఎం కెసిఆర్ గారు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి మేము కూడా పార్టీ కి అండగా ఉంటామని పార్టీలోకి చేరారు. మహేష్ మాట్లాడుతూ పోలాండ్ లో ఇది వరకు ఎలాంటి సంఘం లేదని మొట్టమొదటి సరిగా తెరాస శాఖ ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. ఎంపీ కవిత గారితో తో చర్చించి పూర్తి స్థాయి కమిటీ ని త్వరలోనే ప్రకటిస్తమన్నారు.
ఈ శాఖ అవతరించడానికి శ్యామ్ బాబు ఆకుల సహకరించారని, పోలాండ్ ఎన్నారైలు తెలంగాణ బ్రాండ్ అంబాసిడరాలుగా వ్యవహరించేలా ప్రయత్నిస్తాని కార్యవర్గ సభ్యుడు మహేందర్ బొజ్జ అన్నారు.
తెరాస తాత్కాలిత విభాగకార్యవర్గం :
మహేందర్ బొజ్జ, ఉరవకొండ మహేష్, బెక్కం సాయికిరణ్, రుషికేశ నామ, కోరికంటి వినయ్, జగదీష్, నితిన్ సోమోజు, సాయికృష్ణ పడాల, నరసింహ రెడ్డి, భరత్ లింగంపల్లి, గూడూరి శరత్ రెడ్డి..













