కెన్యా లో టిఆర్ఎస్ శాఖ ప్రారంభం
కెన్యా దేశంలో టిఆర్ఎస్ ఎన్నారై శాఖని కోఆర్డినేటర్ మహేష్ బిగాల స్కైప్ ద్వారా లాంఛనంగా ప్రారంభించి అడ్హాక్ కమిటీని ప్రకటించారు. మహేష్ మాట్లాడుతూ దీనితో విదేశాలలో టిఆర్ఎస్ పార్టీకి 37 శాఖలు ఏర్పడ్డాయని సీఎం కెసిఆర్ జన్మదినం లోపు 40, లోక సభ ఎన్నికలలో 50 శాఖల వరకు విస్తరిస్తామని తెలిపారు. టిఆర్ఎస్ ఎన్నారై సలహాదారు, ఎంపీ కవిత గారితో చర్చించి పూర్తి స్థాయి కమిటీ ని ప్రకటిస్తామన్నారు.
అడ్హాక్ కమిటీ సభ్యులుగా కళ్యాణ్ కుమార్ కొత్త, రవిచందర్ రెడ్డి ముస్కుల, శివకుమార్ మిట్టపల్లి, నరేందర్ రెడ్డి గంట్ల, స్వప్న రెడ్డి, రాజేష్ రెడ్డి చీమర్ల, ప్రశాంతి రెడ్డి, క్రాంతి పాలపాటి ఎన్నికయ్యారు.













