భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం : ట్రంప్
భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలను పెంపొందించుకునేందుకు త్వరలోనే భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్హైజర్.. భారత్తో సంప్రదింపులు జరుపుతున్నారని, త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని పేర్కొన్నారు. కశ్మీర్ విషయంలో మోదీ, ఇమ్రాన్ కలిసి సాగుతారన్న విశ్వాసం తనకుందని తెలిపారు. పాక్ నుంచి ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం నరేంద్రమోదీకి ఉందని వ్యాఖ్యానించారు. మోదీకి ముందు అనేక సమస్యలతో ఉన్న భారతదేశం.. ఆయన హయాంలో ఒకేతాటి పైకి వచ్చిందని మోదీని ప్రశంసించారు. భారతదేశ పితగా ఆయనను అభివర్ణించారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం నేపథ్యంలో న్యూయార్క్లో ట్రంప్, మోదీ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో ఇరువురు నేతలు మాట్లాడారు.













