చైనా కాదు.. ముందు మేమే హెచ్చరించాం
కరోనా వైరస్ మహమ్మారి గురించి తొలి హెచ్చరిక తామే చేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వుహాన్లో అల్లకల్లోలం సృష్టించిన ఆ వైరస్ గురించి తొలుత చైనా వెల్లడించలేదని, ఆ దేశంలో ఉన్న మా సంస్థ ఆఫీసు నుంచి తొలి హెచ్చరిక వచ్చినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. వైరస్ నియంత్రణలో డబ్లూహెచ్వో విఫలమైనట్లు అగ్రరాజ్యం అమెరికా ఆరోపిస్తున్న నేపథ్యంలో… ఆ సంస్థ ఈ రకంగా స్పందించింది. ఏప్రిల్ 9వ తేదీన మొదటిసారి డబ్ల్యూహెచ్వో వైరస్ అంశాన్ని సంబంధించి డేటాను ప్రకటించింది. అయితే డిసెంబర్ 31న వుహాన్లో అనుమానాస్పద కేసులు నమోదు అయినట్లు ఆ జాబితాలో పేర్కొన్నది. కానీ ఎవరూ ఆ అంశాన్ని తొలుత వెల్లడించారో సృష్టం చేయలేదు. న్యుమోనియా కేసలు గురించి చైనా అధికారులు వెల్లడించారా లేక ఇతర వర్గాల ద్వారా ఈ విషయం బయటపడిందా అన్న అనుమానాలను డబ్ల్యూహెచ్వో డైరక్టర్ టెడ్రోస్ క్లియర్ చేయలేదు.













