టైమ్ మ్యాగజీన్ సంచలన కథనం
సార్వత్రిక ఎన్నికలు ముగింపుదశకు చేరుకున్న వేశ ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్ ప్రధాని మోదీపై సంచలన కథనాన్ని ప్రచురించింది. భారత విభజన సారథి(ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్) అనే వివాదాస్పద శీర్షికతో మోదీ చిత్రాన్ని కవర్‌పేజీపై ముద్రించింది. 2014లో ఉజ్వలమైన భవిష్యత్‌పై ఆశలు కల్పిస్తూ అధికారంలోకి వచ్చిన మోదీ ఇప్పుడు ఓ సగటు రాజకీయ నేతగా మిలిగిపోయారంది. ఈ కథనాన్ని ప్రముఖ భారత జర్నలిస్ట్ తవ్లీన్ సింగ్ కొడుకు అతీశ్ తసీర్ రాశారు. యూరప్, ఆఫ్రికా, దక్షిణ పసిఫిక్ అంతర్జాతీయ ఎడిషన్లలో మోదీ ముఖ్య చిత్రంతో టైమ్ మ్యాగజీన్ ప్రధాన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనమున్న ప్రతి 2019, మే 20న ప్రజలకు అందుబాటులోకి రానుంది.













