ట్రంప్ సలహా మండలికి ముగ్గురు సీఈవోల రాజీనామా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రఖ్యాత కంపెనీల సీఈవోలు వరుసగా షాక్ ఇస్తున్నారు. మెర్క్, ఇంటెల్, అండర్ అర్మౌర్ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వైట్ హౌస్ సలహామండలి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అమెరికాలోని వర్జీనియాలో గత శనివారం శ్వేతజాతీయులు, నయా నాజీలు యునైట్ ది రైట్ అనే పేరిట నిర్వహించిన జాత్యంహకార ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఈ తరహా జాత్యంహకార ప్రదర్శనను అధ్యక్షుడు ట్రంప్ సృష్టంగా ఖండించకపోవడాన్ని నిరసిస్తూ మెర్క్ సీఈవో కెన్నెత్ ఫ్రేజిర్, అండర్ అర్మౌర్ వ్యవస్థాపకుడు, సీఈవో కెవిన్ ప్లాంక్, ఇంటెల్ చీఫ్ బ్రియాన్ క్రజానిక్ వైట్‌హౌస్ సలహామండలి పదవులకు రాజీనామా చేశారు. దేశంలో అసహనం, తీవ్రవాదం పెచ్చుమీరుతున్న పరిస్థితుల్లో దేశానికి ప్రమాదకరంగా పరిణమించే విషయల్లో ట్రంప్ ఆలస్యంగా స్పందించడం సరికాదు అని కెన్నెత్ ఫ్రేజిర్ తెలిపారు. దేశంలోని మిగత వర్గాలకు భరోసా ఇవ్వాల్సిన సయమంలో అధ్యక్షుడి తీరు విస్మయపరిచిందన్నారు.













