Niharika: నీహారిక మౌంట్ కిలిమంజారో ప్రయాణం…విశేషాలు
డల్లాస్ కు చెందిన నీహారిక మేక తాను చేసిన మౌంట్ కిలిమంజారో ప్రయాణ విశేషాలను తెలుగు టైమ్స్ పాఠకులతో పంచుకుంది. ఆమె మాటల్లోనే ఈ ప్రయాణం గురించి తెలుసుకుంటాం. సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 9:30కి, అన్ని అడ్డంకులను జయించి, నేను (నీహారిక మేక) ఆఫ్రికా మహాద్వీపపు అత్యున్నత శిఖరమైన మౌంట్ కిలిమంజారోలోని ఉహురు పీక్ వద్దకు చేరుకున్నాము. సముద్ర మట్టానికి 19,341 అడుగులు (5895 మీటర్లు) ఎత్తులో. సముద్ర మట్టంతో పోలిస్తే అక్కడ ఆక్సిజన్ సుమారు 50శాతం తక్కువగా ఉండగా, ఆ అనుభూతి అసాధారణమైనది మరియు వినమ్రతను కలిగించేది. మేము నిజంగా అదృష్టవంతులం. మాకు స్పష్టమైన, ఎండలతో కూడిన మంచి వాతావరణం తోడ్పడిరది. ప్రయాణమధ్యలో, మేము వివిధ రకాల మొక్కలను (డెండ్రోసెనెషియో కిలిమంజారి), అద్భుతమైన హిమశిలలు, ఆహ్లాదకరమైన సూర్యోదయాలు మరియు సూర్యాస్తమయాలు, గొప్ప ప్రకృతి దృశ్యాలను మరియు ప్రకృతి యొక్క అసలైన సౌందర్యాన్ని చూశాము.
నా హైకింగ్ ప్రయాణం డల్లాస్లో వారాంతాల్లో చిన్న చిన్న హైక్స్తో మొదలైంది కొన్ని సంవత్సరాల పాటు. క్రమంగా, నేను టెక్సాస్లోని అత్యున్నత శిఖరం అయిన గ్వాడలూపీ పీక్ (8,751 అడుగులు) పైకి ఎక్కాను. ఆ తర్వాత కొలరాడోలోని 14,000 అడుగుల శిఖరాలు, పైక్స్ పీక్ (14,115 అడుగులు) ఎక్కాను. అక్కడి నుంచి ఈ ప్రయాణం నన్ను మౌంట్ కిలిమంజారో (19,341 అడుగులు) వరకు తీసుకెళ్లింది. ఇది నిజంగా జీవితాన్నే మార్చేసే అనుభవంగా మారింది. నేను బైకింగ్, హైకింగ్, స్విమ్మింగ్, స్ట్రెంథ్ ట్రైనింగ్, యోగా ఇలా కలిపి చేస్తూ ఉండటం వల్ల హైకింగ్ చేయడానికి నాకు వీలైంది. నాకు ఫిట్నెస్ అనేది ఒక గమ్యం కాదు, ఒక ప్రయాణం. ప్రతీ రోజు ఏదో ఒక కొత్త యాక్టివిటీ చేయడం వల్ల బోర్ కాకుండా ఉంటుంది. ఇది నన్ను మానసికంగా మరియు శారీరకంగా ఉత్సాహంగా ఉంచుతోంది.
ప్రకృతితో మళ్లీ కలవడమూ, కొత్త మనుషులను కలవడమూ, మనసుకు శాంతి మరియు సంతృప్తిని పొందడమూ నాకు ఎంతో ఇష్టమైనది. శిఖరం వరకు చేరుకోవడమే ఒకే ఒక్క లక్ష్యంగా ఉన్నప్పుడు వచ్చే దృఢమైన ఫోకస్, స్పష్టత, మరియు లోతైన తృప్తి ఇవే మన హైకింగ్ను మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. నాతోపాటు 11 మంది గ్రూపుగా ఏర్పడి హైకింగ్ చేస్తుంటాము. ఈ హైకింగ్ గ్రూప్ ప్రత్యేకత ఏమిటంటే ు అందరం తెలుగువాళ్లమూ. నా హైకింగ్ ప్రయాణంలో ప్రతి అడుగులో నాతో తోడుగా ఉన్న వీరిని కలవడం నా అదృష్టం. 11 మందితో కూడిన ఈ గ్రూప్ (హైకింగ్ వారియర్స్) తో కలిసి స్థానికంగా తరచూ హైక్స్ చేస్తూ, ప్రతి ఏడాది ఒక అంతర్జాతీయ హైక్ కూడా ప్లాన్ చేస్తుంటాము. నా కిలిమంజారో హైకింగ్లో నాతోపాటు నీలిమ, లావణ్య, జ్యోతి, వల్లి, నీహారిక, సంగీత, శృతి, బాలు, పూర్ణ కూడా పాల్గొన్నారు.







