ఐశ్వర్య మృతదేహం తరలింపునకు సహాయపడిన తానా
టెక్సాస్ లోని ప్రీమియం ఔట్లెట్ మాల్ లో జరిగిన కాల్పులలో తెలుగమ్మాయి ఐశ్వర్య తాటికొండ మృతదేహాన్ని ఇండియాకు పంపించడంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) టీమ్ స్క్వేర్ సహాయాన్ని అందించింది. తానా ట్రెజరర్ అశోక్‌బాబు కొల్లా మృతదేహాన్ని ఇండియాకు పంపించడానికి అవసరమైన పేపర్ వర్క్‌ను సిద్ధం చేసి కాన్సులేట్ అధికారులతో సమన్వయం చేసుకుని మృతదేహం ఇండియాకు వెళ్ళేలా చూశారు. ఆయనతోపాటు శ్రీకాంత్ పోలవరపు కూడా ఈ సహాయం చేయడంలో నిర్విరామంగా పనిచేశారు. హ్యూస్టన్‌లోని భారత రాయబార కార్యాలయంతో తానా వలంటీర్లు తొలుత సంప్రదింపులు జరిపి, మృతదేహాన్ని ఇండియాకు పంపించేందుకు అవసరమైన అనుమతులు పొందడానికి విమానయాన సంస్థలతో సమన్వయం చేసుకుని మృతదేహాన్ని ఇండియాకు పంపించడంలో వారు సహాయాన్ని అందించారు. తానా చేసిన సహాయాన్ని పలువురు భారతీయులు, తెలుగువారు హర్షం వ్యక్తం చేశారు.













