ప్రవాస భారతీయుడికి జీవితఖైదు
మూడేండ్ల వయసున్న కూతురును హత్య చేసి కేసులో ప్రవాస భారతీయుడు వెస్లీ మాథ్యూస్‌కు (39)అమెరికాలోని టెక్సాస్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 30 ఏండ్లు జైలులో గడిపిన తర్వాత పెరోల్ తీసుకోవడానికి ఆయనకు అవకాశం లభిస్తుందని చెప్పింది. అమెరికాలోని టెక్సాస్‌లో స్థిరపడిన కేరళకు చెందిన వెస్లీ మాథ్యూస్, సినీ దంపుతుల 2016లో బీహార్‌లోని నలంద జిల్లాలో ఉన్న ఓ అనాథాశ్రమం నుంచి షెరిన్ అనే పాపను దత్తత తీసుకున్నారు. 2017 అక్టోబర్ 7న షెరిన్ కనిపించడం లేదంటూ వెస్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాలు తాగకుండా మారాం చేస్తుండటంతో భయపెట్టేందుకు తెల్లవారుజామున 3 గంటలకు ఇంటిబయట నిలబెట్టి తలుపు వేశానని.. 15 నిమిషాల తర్వాత చూస్తే కనిపించలేదని చెప్పారు. 15 రోజుల గాలింపు అనంతరం ఓ కల్వర్టు కింద కుళ్లిపోయిన స్థితిలో చిన్నారి మృతదేహం లభించింది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతోతానే షెరిన్ హత్య చేసినట్టు వెస్లీ ఒప్పుకున్నాడు. పాలు తాగకుండా మారాం చేస్తుండటంతో కొట్టానని, గట్టిగా తగలడంతో మరణించిదని వెల్లడించారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. పూర్వాపరాలను పరిశీలించిన 12 మంది జడ్జిల ధర్మాసనం వెస్లీకి జీవిత ఖైదు విధించింది.













