డొనాల్డ్ ట్రంప్ కు నిరసన సెగ
లాక్డౌన్ అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. టుల్సాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీకి నల్ల జాతీయుల నుంచి నిరసన సెగ తగిలింది. నగరం లోని పలు చోట్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. వందాలాదిమంది నిరసనకారులు నల్లజాతీయుల జీవిత సమస్య పేరుతో ఉన్న టీ షర్టస్ ధరించి జాతి వివక్షకు వ్యతిరేకంగా నినదించారు. కొన్ని చోట్ల ట్రంప్ మద్దతుదారులతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆందోళనకారులను అడ్డుకున్న ట్రంప్ మద్దతుదారులు అందరి జీవితాల సమస్య అంటూ ప్రతి నినాదాలు చేశారు. సాయుధులైన మద్దతుదారులు కొందరు నల్లజాతీయులను వెంటాడారు. ఓ చోట రహదారిని దిగ్బంధించేందుకు యత్నించిన నల్లజాతీయులపై ఓ వ్యక్తి ట్రక్కులోంచి దిగి పెప్పర్ స్ప్రే చల్లారు. మరోవైపు పోలీసులు కూబా ఆందోళనకారులపై భాష్పవాయువు ప్రయోగించి చెదరగొట్టారు. ట్రంప్ ప్రసంగించాల్సి వేదిక (బిఒకె సెంటర్) సమీపంలోనూ ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అయితే, ట్రంప్ మద్దతుదారుల సంఖ్య అధికంగా ఉండటంతో ఆందోళనకారులు వెనక్కి తగ్గారు. స్టేడియం బయట ర్యాలీ నిర్వహించాలనుకున్న ట్రంప్ నిరసనల నేపథ్యంలో ఆ ఆలోచన విరమించుకున్నాడు.













