జగన్ ప్రభుత్వ 3 రాజధాని ప్రతిపాదనలకు ఎన్నారైల మద్దతు
ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రతిపాదనలను పలువురు ఎన్నారైలు సమర్థించారు. అభివద్ధి వికేంద్రీకరణ అంశంపై పలు నగరాల్లో ఉన్న తెలుగు ఎన్నారైలు స్పందిస్తూ, రాష్ట్ర సర్వతోముఖాభివద్ధికి మూడు రాజధానుల ప్రతిపాదనలు సమర్థనీయమేనన్నారు. కాలిఫోర్నియా, ఓహాయో నగరాల్లో ‘ఐ సపోర్ట్ త్రీ కేపిటల్స్’ అంటూ ప్రదర్శనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సమగ్రాభివద్ధి జరగాలంటే మూడు రాజధానులు అవసరమని అన్నారు. అభివద్ధి వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివద్ధి చెందుతాయని ఆకాంక్షించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన వికేంద్రీకరణ అంశానికి సంపూర్ణమద్దతిస్తున్నామని తెలిపారు. కాలిఫోర్నియాలోని ఫ్రెమాంట్, లేక్ ఎలిజబెత్ పార్కులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్నారైలు సమావేశమై తమ మద్దతును ప్రకటించారు. ‘ఐ సపోర్ట్ త్రీ కేపిటల్స్’ పోస్టర్లు ప్రదర్శించారు.













