అల్లెన్, టెక్సాస్ కాల్పులలో ‘ఐశ్వర్య తాటికొండ’ మృతి
అల్లెన్, టెక్సాస్ లోని ప్రీమియం ఔట్లెట్ మాల్ లో నిన్న జరిగిన కాల్పులలో మరణించిన 8 మందిలో, 27 సంవత్సరాల తెలుగింటి ఆడపడుచు ‘ఐశ్వర్య తాటికొండ’ కూడా చనిపోవడంతో అమెరికాలోని తెలుగు సమాజంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఐశ్వర్య తండ్రి నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిగా పని చేస్తున్నారు. ఐశ్వర్య మృతితో కొత్తపేటలోని ఆమె నివాసం వద్ద విషాదం నెలకొంది. నల్ల రంగు కారులో వచ్చిన దుండగుడు.. దుకాణాల బయటి నుంచే కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు.. దుండగుడిని కాల్చి చంపారు. తానా కోశాధికారి అశోక్ బాబు కొల్లా అమ్మాయి తల్లితండ్రులతో, పోలీసులతో మాట్లాడుతూ తానా తరపున సహాయాన్ని అందిస్తున్నారు.













