న్యూ ఇంగ్లండ్ లో తానా వారి అమెరికా లైబ్రరీలలో తెలుగు పుస్తకాలు
అమెరికా లో ఆరు రాష్ట్రాల సమ్మేళనం న్యూ ఇంగ్లాండ్ ప్రాంతం, ఆ న్యూ ఇంగ్లండ్ లో, తానా వా రి “అమెరికా లైబ్రరీలలో తెలుగు పుస్తకాలు “కార్యక్రమం ద్వారా శ్రీకారం చుట్టారు, ఈ కార్యక్రమంతో కొత్త తరానికి నాంది పలికారు. ఈ కార్యక్రమంలో భాగం గా తానా వెస్ట్బరో లైబ్రరీకి అనేక పుస్తకాలను అందించింది ఆంగ్ల తెలుగు నిఘంటువు, వేమన పద్యాలు, చందమామ కథలు, పెద్ద బాల శిక్ష మరియు మరెన్నో పుస్తకాలను పంపిణీ చేశారు, భవిష్యత్తులో న్యూ ఇంగ్లాండ్లో తెలుగు పుస్తకాలు అనేక లైబ్రరీలలో అందుబాటులోకి తెస్తారు.
తెలుగు మాతృభాషా ప్రజలందరూ తెలుగు భాషను కాపాడుకోవడానికి నడుం బిగించాలి, తెలుగు భాషను, మన సంస్కృతిని కాపాడుకోవడం మన బాధ్యత. ఎదో చేసాం అని వొరవడి కాకుండ తన వంతు సహాయం తెలుగు భాషా పిల్లలకు చిన్నప్పటి నుంచి శ్రద్ధ కలిపించాలి ఎవరికైనా తెలుగు పుస్తకం కావాలంటే దయచేసి తానా ని సంప్రదించండి.
ఈ కార్యక్రమంలో భాగంగా న్యూ ఇంగ్లాండ్ తానా ప్రతినిధి ప్రదీప్ గడ్డం, గోపి నెక్కలపూడి, కెపి సోంపల్లి, విజయ్ బెజవాడ,శ్రీనివాస్ గొర్లే, పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డాక్టర్ నరేన్ కొడాలి గారికి తానా అధ్యక్షులు అధ్యక్షుడు అంజయ్య లావు గారికి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త రాజా కసుకుర్తి గారికి, అమెరికా గ్రంధాలయలలొ తెలుగు పుస్తకాల కార్యక్రమ సమన్వకర్తలు అనిల్ ఉప్పలపాటి గారికి, భాను మొగలూరి గారికి కృతజ్ఞతలు తెలిపారు.













