ప్రాంతాల, కులాల ప్రాతిపదిక మీద పెరుగుతున్న తెలుగు సంఘాలు
అమెరికాలో నాడు తెలుగువాళ్ళు జాతీయ లక్ష్యంతో కుల, ప్రాంతీయ భేదాల్లేకుండా తెలుగు సంఘాలను ఏర్పాటు చేశారు. కాని ఇటీవలి కాలంలో ఏర్పడుతున్న తెలుగు సంఘాల లక్ష్యం మాత్రం ప్రాంతీయ, కుల భావలతో ఉండటం కనిపిస్తోంది. దీనికి రకరకాల కారణాలు కావచ్చు. తమ ప్రాంతం వేడుకలను, కళలను, తమ వాళ్ళకు వేదిక కల్పించడంతోపాటు వాటిని అందరికీ పరిచయం చేయాలన్న సదుద్దేశ్యంతోనూ ఈ సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో తెలంగాణ ప్రాంత సంఘాలు వస్తే, నేడు ఆంధ్ర ప్రాంత తెలుగు సంఘాలు వచ్చాయి. అలాగే సీమాంధ్ర, కులాలవారీగా, జిల్లాలవారీగా కూడా సంఘాలు ఏర్పడుతున్నాయి.
వీటిపై తెలుగు టైమ్స్ విశ్లేషణాత్మకఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగువారికి అమెరికా ఒక పక్క రాష్ట్రంలా అయిపోయిందంటే అతిశయోక్తి కాదు. 20 ఏళ్లుగా అమెరికా వస్తున్న తెలుగువారి సంఖ్య గమనిస్తే ఎవరికైనా ఆశ్చర్యపోయే పురోగతి కనిపిస్తుంది. అమెరికా దేశం మన దేశం నుంచి హెచ్ 1బీ వీసాలు సంవత్సరానికి దాదాపు 65,000 దాకా అనుమతి ఇస్తారు. అందులో దాదాపు 30 శాతం తెలుగువారే ఉంటున్నారు. అలాగే భారతదేశం నుంచి దాదాపు 1,00,000 విద్యార్థులకు వీసాలు (సంవత్సరానికి) ఇస్తూంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40 శాతం విద్యార్థులు వస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం దాదాపుగా 50,000- 60,000 మంది అమెరికాకి వస్తున్నారు. దాదాపు 15 లక్షల మందితో అమెరికాలో అతిపెద్ద భారతీయ సంతతిగా తెలుగు కమ్యూనిటీ ఉన్నట్లు తెలుస్తోంది.
విద్యార్థిగా వచ్చిన వారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఉద్యోగం తెచ్చుకోవడం కూడా మాములు విషయమే. అలాగే అమెరికాలో అనేక యూనివర్సిటీలు రావడం, వారు అడ్మిషన్ ప్రక్రియ సులభతరం చేయడం.. ఆ విధంగా ఆ యూనివర్శిటీ వారు ఇచ్చే పత్రాల వలన వీసాలు మంజూరు అవడం వలన తెలుగు అమెరికాలో పెరుగుతున్న భారతీయు కమ్యూనిటీ అని అందరూ చెపుతున్నారు. అమెరికాలో అన్ని పట్టణాలలో పెరుగుతున్న ఇండియన్ రెష్టారెంట్లు, హిందూ దేవాలయాలు, వారం వారం విడుదల అవుతున్న తెలుగు సినిమాలు ప్రస్తుతం ఉన్న తెలుగు కమ్యూనిటీ స్టామినాని తెలుపు తున్నాయి. ఒక పక్క పెద్ద పెద్ద ఐటీ కంపెనీ లతో పెద్ద ఉద్యోగాలలో పేరు తెచ్చుకొంటున్న తెలుగు వారు, ఇంకొపక్క అన్ని వ్యాపారరంగాల్లో ప్రవేశించి పెరుగుతున్న తెలుగు వ్యాపారవేత్తలు తెలుగువారి స్థితిని ఎప్పటికప్పుడు అందరికీ తెలిసేలా చేస్తున్నారు. తెలుగుటైమ్స్ ఇదివరకే ఒక శీర్షికలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక వచ్చిన తెలుగు సంఘాలను వివరించింది. వాటిలో కొన్ని ఇప్పటికే చెప్పుకొందాం.
తెలుగు సంఘాలు – అభివృద్ధి
ప్రస్తుతం ఉన్న తెలుగు సంఘాలు దాదాపుగా అన్ని వైపులా తమ అభివృద్ధి కోసం శ్రమ పడుతున్నాయి. తానా సంస్థ తమ సభ్యుల సంఖ్య 70,000 వరకు తీసుకెళ్ళింది. అలాగే ఆటా, నాటా, నాట్స్ సంస్థలు కూడా మెంబర్షిప్ డ్రైవ్. ప్రోగ్రాంలు తమ సభ్యుల సంఖ్య పెంచుకొంటున్నారు. అలాగే ప్రతి పట్టణంలో ఉన్న తెలుగు సంఘాలు కూడా తమ 10వ వార్షికోత్సవం, 20వ వార్షికోత్సవం, 25వ వార్సికోత్సవం, 40వ వార్షికోత్సవం అంటూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ కమ్యూనిటీని తమ వేడుకలకు రప్పిస్తున్నారు… సభ్యులగా చేర్పిస్తున్నారు. కొత్త ఆలోచనలతో విన్నూత కార్యక్రమాలు చేస్తూ తమ సంఘంలో సభ్యుల సంఖ్య పెంచుకొంటున్నారు. అయితే ఈ సభ్యులను చేర్చుకొనే కార్యక్రమం ఆ సంవత్సరం ఎన్నికల ముందు జరుగుతోంది అని, కేవలం వోటు కోసం కొత్త సభ్యులను చేర్చుకున్నారు అని కొన్ని సందేహాలు కూడా బయటకు వచ్చాయి.
కొత్త సంఘాలు-కొత్త పోకడలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అనేక పట్టణాలలో తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాయి. వాటికి పోటీగా (లేదా దీటుగా) కొన్ని చోట్ల ఆంధ్ర సంఘాలు కూడా వచ్చాయి. అలాగే ఈ మధ్య కాలంలో జాతీయ సంఘాలు కూడా చాలా ఏర్పడ్డాయి. వాటిలో కొన్ని పరిశీలిద్దాం..
మన అమెరికా తెలుగు సంఘం
(Mana American Telugu Association) (MATA)
అన్ని తెలుగు సంఘాలలో లాగా నాయకత్వ పోటీ ఉండదు. నాయకులు వుండరు. అందరూ సమానమే. ఇది మన సంఘం అంటూ ప్రారంభమైన ‘మాట (MATA) – సేవ, సంస్కృతి, సమానత్వం అనేక 3 సూత్రాలతో నడుస్తోంది అని శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామాల న్యూజెర్సీలో జరిగిన మాట ప్రారంభ వేడుకలలో చెప్పారు. మాట వారి వెబ్సైటు కూడా ఎక్కడా నాయకత్వ వివరాలు, కార్యవర్గ సభ్యులు వివరాలు లేకపోవడం విశేషం. మాట సంస్థ ఇప్పటికే తెలుగు కమ్యూనిటీలో తమ ఉనికిని తెలపటానికి యోగా క్లాసులు, ఆయుర్వేద క్లాసులు, ఐటీరంగం వారికోసం శిక్షణ తరగతులు నిర్వహించడం మొదలు పెట్టింది. వచ్చే నెల దసరా – బతుకమ్మ ఉత్సవాలు చేయటానికి సన్నాహాలు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్
(Andhra Pradesh American Association) (AAA)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్కృతి వారసత్వం విశేషాలు, (Culture – Heritage) ముందు తరాలకీ అందించాలన్న సంకల్పంతో AAAని ఏర్పాటు చేశామని, మన ఆంధ్ర రాష్ట్ర తెలుగు పండుగలు బోగి, సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవవి, ఏవిధంగా పల్లెటూర్లలో చేసుకో న్నామో గుర్తు చేసుకొంటూ అని ఇక్కడి (అమెరికాలో) ఉంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగు కమ్యూనిటీకి ఇవ్వాలని ఈ సంఘం పనిచేస్తుందని ఫౌండర్ హరి మోటుపల్లి తెలిపారు.
హరి మోటుపల్లి AAA గురించి చెపుతూ ఇతర సంఘాలతో నాయకత్వ భాధ్యతలు నిర్వహించిన, ఇంకా నిర్వహిస్తున్న అనేక మందితో కలిసి AAA ఏర్పడిందని, ప్రస్తుతం AAA న్యూజెర్సీ, డెలావేర్, పెనిసేల్వేనియాలో చాపర్స్ ఏర్పాటు చేశామని, ఒకే కూలానికి ప్రాముఖ్యత ఇచ్చాము అని చెడ్డ పేరు రాకుండా అన్ని AAA చాఫ్టర్లలో నాయకత్వ పదవులకు అన్ని కులాల వారిని గౌరవిస్తూ ఎన్నిక చేశామని తెలిపారు. పూర్తిగా ఆంధ్ర రాష్ట్రం పండుగ అయిన శ్రావణ మాస వరలక్ష్మి పూజని ఒక సామూహిక వేడుకగా అన్ని చోట్ల ఘనంగా జరిగేందుకు AAA ఏర్పాట్లు చేసిందని తెలిపారు
శ్రావణ మాసపు వరలక్ష్మి పూజ కార్యక్రమాన్ని వినూత్నంగా న్యూజెర్సీలో సెప్టెంబర్ 2వ తేదీన, ఫిలడెల్పియాలో సెప్టెంబర్ 3వ తేదీన జరిగాయి. ప్రతి చోట కూడా ఇదుగురు పూజారులు వచ్చి మహిళల చేత అన్ని పూజా సామాగ్రితో పూజలు చేయించారు. వచ్చిన అథిదులకు మంచి విందు భోజనం ఏర్పాటు చేశారు. న్యూజెర్సీలో మణిశర్మ సంగీత విభావరి నిర్వహించారు. డెలావేర్లో కోటి సంగీత విభావరి నిర్వహించారు. చాలా వినూత్నంగా జరిగిన ఈ వేడుకలను అందరూ ఎంతో సంబంరంగా జరుపుకొన్నారు.
గ్లోబల్ తెలంగాణా సంఘం
(Global Telangana Association) (GTA)
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పెరుగుతున్న తెలంగాణా అభిరుచులను దృష్టిలో ఉంచుకొని ఒక విశ్వ వేదిక అవసరం అని భావించి గ్లోబల్ తెలంగాణ సంఘం అని ఏర్పరిచామని, అమెరికాలో వివిధ పట్టణాలలో ఈ సంఘానికి అనుబంధంగా చాఫ్టర్లు ఏర్పాటు చేస్తున్నామని విశ్వేశ్వర్ కలవల తెలిపారు. GTA కేవలం అమెరికాకు మాత్రమే పరిమితం కాదని, అన్ని దేశాలలో ఉన్న తెలంగాణ కమ్యూనిటీ వారి వారి దేశాలలో GTA అనుబంధ సంఘాలుగా వస్తా యని, ఇప్పటికే అనేక దేశాల నుంచి అనుహ్య మైన స్పందన వస్తోందని, ఒక్కోక్క GTA Chapter ఏర్పాటు అవుతోందని విశ్వేశ్వర్ కలవల తెలిపారు.
జవనరి 2023న హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇతర ప్రముఖులతో ప్రారంభ మైన గ్లోబల్ తెలంగాణ సంఘం ప్రస్తుతం అమెరికాలో తెలంగాణా జానపద కవి గోరెటి వెంకన్నతో అన్ని ప్రముఖ పట్టణాలలో మీట్ డ గ్రీట్ కార్యక్రమం చేస్తూ ఆ పట్టణాలతో GTA Chapter ప్రారంభిస్తున్నా మని, ప్రతి పట్టణంలోను GTA ఏర్పాటుకు మంచి స్పందన వస్తోందని విశ్వేస్వర్ కలవల తెలిపారు. అలాగే గ్లోబల్ తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను వివిధ నగరాల్లో నిర్వహిస్తున్నట్లు విశ్వేశ్వర్ కలవల తెలిపారు.
అట్లాంటాలో పల్లె వంట
అమెరికాలో అట్లాంటాలో మొదటిగా 1,500 మందితో పల్లె వంట కార్యక్రమం నిర్వహించా మని GుA కార్యవర్గ సభ్యులను వచ్చిన కమ్యూనిటీ పరిచయం చేసి, GTA ఆశయాల ను, విధి విధానాలను వివరించామని, అందరూ హర్షధ్వానాలతో మా సంఘాన్ని అభినందించారని విశేశ్వర్ తెలిపారు.
చివరి మాట
కొత్త సంఘాలు రావడం వలన పోటీ పెరిగి, అన్ని సంఘాలు కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆది మంచిది అని అభిప్రాయం చాలా మందికి ఉంది. కానీ కేవలం నాయకత్వం కోసం సంఘాలు ఏర్పాటు మంచిది కాదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాగే ‘మనం భారతీ యులం’ అంటూ మొదలై ‘మనం తెలుగు వాళ్ళం’ వరకు వచ్చి, ‘మనం తెలంగాణా వాళ్ళం’ ‘మనం ఆంధ్ర వాళ్ళం వరకు’ సాగింది. కొంచెం బాధ వేసినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, ఆ తర్వాత తెలంగాణ సంస్కృతి కూడా అందరికీ తెలిసేలా తెలంగాణ సంఘాలు వివిధ కార్యక్రమాలు చేయటంతో అవి కూడా అందరి ఆమోదం పొంది ప్రస్తుతం అందరి మన్ననలు పొందుతున్నాయి. ఆ తర్వాత పరిణామం ‘మనం ఫలానా కులం వాళ్లం’ ‘మనం మనం ఒకటి అంటూ వస్తున్న కొత్త ధోరణి చాలా మందికి నచ్చడం లేదు. బాగా చదువుకుని అమెరికాలో మంచి ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్న మన వాళ్ళు ఈ విధంగా కులాల ఆధారంగా జత కట్టడం చాలా బాధగా ఉంది. ఇది మంచి పరిణామం కాదు’ అని ఒక సీనియర్ బాధపడటం జరిగింది.
అదేవిధంగా ఇదివరకు కంటే చాల ఎక్కువగా కులం పేరుతొ అందరు దగ్గరవుతున్నారు అని, ఒక్కో సంఘం లో కార్య వర్గ సభ్యులు అందరూ ఒకే కులం నుంచి ఎన్నికవడం జరుగుతోందని, ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం అని ఒక సీనియర్ నాయకుడు బాధ పడటం చూసాం. రాబోయే రోజుల్లో ఈ కులాల లేదా ప్రాంతాల ప్రతిపాదిక మీద కాకుండా అర్హత, యోగ్యతల ప్రామాణాలుగా నాయకులు రావాలని, సంఘాలు అందరిని కలుపుకు పోవాలని, అందరి మన్ననలు పొందాలని కోరుకుందాం. కథనాన్ని ఈ సంచికలో మీకు అందిస్తోంది.













