సంక్రాంతి సరాగాలు! సిరి మువ్వల సింగారాలు!!
మెంఫిస్ తెలుగు సమితి ఆధ్వర్యంలో మెంఫిస్ మహాపట్టణంలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరుపుకొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కొన్ని వందల తెలుగు కుటుంబాల పిన్నలు పెద్దలు అత్యుత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. సమితి ప్రెసిడెంట్ శ్రీ కృష్ణ పెరి, బోర్డు ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ శ్రీ కిరణ్ పారపూడి తెలుగు కుటంబాలు అందిస్తున్న హార్దిక మరియు ఆర్ధిక సహాయ సహకారాల్ని అలాగే సమితి నిర్వహించే కార్యక్రమాల్ని సభ్యులు, స్పాన్సర్లు ఇతోధికంగా ప్రోత్సహించడాన్ని కొనియాడారు. గతంలో మెంఫిస్ తెలుగు సమితి భాధ్యతల్ని నిర్వహించిన శ్రీ నవీన్ మామిడిపల్లి, శ్రీ రత్నాకర్ వాన మరియు శ్రీ చిరంజీవి గొంప తమ వంతు సహాయాన్ని అందించడమే కాక సంబరాల్లో పాల్గొన్న తెలుగు వారితో మమేకమయ్యారు. మెంఫిస్ తెలుగు సమితి ఆధ్వర్యంలో మెంఫిస్ మహాపట్టణంలోనే కాదు టెన్నిస్సీ రాష్ట్రంలోదాదాపుగా గత నలభై సంవత్సరాలుగాతెలుగువారికి యెనలేని సేవ చేస్తున్న సాంస్కృతికవేదిక.
ఫిబ్రవరి 2న సాయంత్రం 4 గంటలకి ప్రారంభమైన ఈ సంక్రాంతి సంబరాలకు వెస్ట్ కాళీర్వీల్లె మిడిల్ స్కూల్ వేదికగా నిలచింది. ఎనెన్నో కార్యక్రమాలతో మెంఫిస్ ఔత్సాహిక కళాకారులు ప్రేక్షకుల విశేష అభిమానం చూరగొన్నారు. ఆటలు, పాటలు, చిన్నారులకి భోగిపళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, పాడుతా తీయగా వేదికమీద తన గళంతో శ్రోతల విశేష అభిమానం చూరగొన్న శ్రీకాంత్ సందుగు పాటలతో, ఘుమ ఘుమలాడే వంటకాలవిందు భోజనం తో మెంఫిస్ తెలుగు సమితి వారి ఈ సంక్రాంతి కార్యక్రమం కార్య నిర్వాహక సభ్యులు దీప కుండవజ్జుల, మహేష్ నందికంటి, ఫని తీగలపల్లి, రోహిణి కల, అనిల్ బయన్న సహకారంతో ఈ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి.
“వేయినామాలవాడే వెంకటేశుడే” అద్భుతకూచిపూడి నృత్య ప్రదర్శనలో పాల్గొన్న నర్తకీమణులు: సాత్విక సెంథిల్ కుమార్, అమృత గరుడాద్రి, శాన్వికుంటమల్ల, సహస్ర ససిపల్లి, యోగిత మానస డింతకుర్తి, చంద్రప్రభ వాసిలి. నృత్య దర్శకత్వం: డాక్టర్ రమణ వాసిలి
Dr. Ramana Vasili
Spiritual Foundation, Inc.
7062 S. Beringer Drive
Cordova, TN 38018
901-387-9646 ramanavvasili@hotmail.com













