తెలంగాణ టూరిజం అంబాసిడర్ గా ప్రవాసులు!
తెలంగాణలో పర్యాటకరంగాన్ని విస్తృతం చేసేందుకు రాష్ట్ర టూరిజంశాఖ వినూత్న ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రవాస తెలంగాణ వాసులను అంబాసిడర్ లుగా నియమించేందుకు పర్యాటకశాఖ కసరత్తు చేస్తున్నది. తెలంగాణ వచ్చే వరకు ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించిన ఎన్నారైలకు గుర్తింపు వచ్చేలా ఈ అంబాసిడర్ ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఈ ప్రణాళిక సిద్ధమైన తర్వాత తెలంగాణ టూరిజానికి అంబాసిడర్‌గా గుర్తింపు పొందాలను కొనేవారు ఆన్లైన్లో తమ పేరును నమోదు చేసుకోవచ్చు. తెలంగాణ అంబాసిడర్లుగా గుర్తింపు పొందినవాళ్లు తాముంటున్న దేశాల్లోని పర్యాటకులకు తెలంగాణ పర్యటించేలా ప్రచారం చేయాల్సి ఉంటుంది. తమ తద దేశాల్లో స్థానికంగా జరిగే ఉత్సవాలు, సమావేశాలు, గెట్టుగెదర్, పార్టీలు ఇలా అవకాశం ఉన్న ప్రతిచోటా తెలంగాణలో ఆలయాలు, చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలు, ఇతర ఆకర్షణీయమైన అంశాలను ప్రచారం చేయాలి. ఇందుకోసం పర్యటకానికి సంబంధించిన వాల్‌పోస్టర్లు, కరపత్రాలు, ఆల్బమ్‌లను టూరిజం శాఖ అందిస్తుంది.













