25 దేశాలలో టిఆర్ఎస్ ఎన్నారై ఆద్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు
– మొదలు కాబోతున్న ఫెడరల్ ఫ్రంట్ పైన చర్చలు
– ఎన్నారైలకు పెట్టుబడిసాయం కొరకు ప్రత్యేక విధానం ప్రకటించినందుకు కృతజ్ఞతలు
– మీడియాతో టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల
జూన్ రెండు నుండి ఇరవై అయిదు దేశాలలో తెలంగాణ రాష్ట్ర దినోత్సవాలను జరుపుకుంటున్నామని టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. యూఎస్ఏ, యూకే, యూరోప్, గల్ఫ్, ఏసియా, ఆఫ్రికా తదితర ఖండాలలోని టిఆర్ఎస్ ఎన్నారై శాఖలు జరుపబోతున్నాయని అన్నారు. అవతరణ దినోత్సవాలతో పాటు సీఎం కెసిఆర్ గారి ఫెడరల్ ఫ్రంట్ పైన చర్చ మొదలు పెడుతున్నామన్నారు. జూన్ తొమ్మది నుండి కొన్ని దేశాల్లో తాను స్వయంగా ఈ కార్యక్రమాలలో పాల్గొంటానని అన్నారు. ఇటలీ, డెన్మార్క్, మలేసియా, సింగపూర్, లండన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహించబోతున్నాం అన్నారు.
ఈ కార్యక్రమాలకు అన్ని దేశాలలో ఉన్న అన్ని ప్రజాసంఘాలను ఆహ్వానిస్తున్నాం అన్నారు.
ఎన్నారైలకు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం కొరకు ప్రత్యేక విధానంను సీఎం కెసిఆర్ గారు ప్రకటిస్తామన్నందుకు ఎన్నారైలమందరి తరుపున ధన్యవాదాలు తెలిపారు. తనతోసహా చాల మంది ఎన్నారైలు చెక్ లను తిరిగిఇచ్చి వేశారన్నారు.రైతుబంధు పథకం సూపర్ హిట్ అయిందని అన్నారు.













