సింగపూర్ లో తెలంగాణ బలగం అలయ్ బలయ్
సింగపూర్‌లో తెలంగాణ బలగం అలయ్ బలయ్ 2023 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఫ్యామిలీ డే లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆఫ్ సింగపూర్ (టీసీఎస్ఎస్) ప్రధాన కార్యదర్శి, మెదక్ జిల్లా రుక్మాపూర్ గ్రామానికి చెందిన బసికె ప్రశాంత్ రెడ్డి తెలిపారు. తెలుగు సంస్కృతిని, ఆటలను భావితరాలకు అందించాలన్న ఉద్దేశంతో ఖోఖో, అష్టాచమ్మ, పచ్చీస్, కచ్చకాయలు తదితర ఆటలను పిల్లలతో ఆడిరచి విజేతలకు బహుమతులు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీసీఎస్ఎస్ అధ్యక్షుడు రమేష్‌బాబు, కోశాధికారి సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.













