టిడిఎఫ్ వనభోజనాలకు మంచి స్పందన
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టిడిఎఫ్) ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అట్లాంటా ఛాప్టర్ ఆధ్వర్యంలో ఇటీవల చెట్ల కింద వంట పేరుతో వన భోజనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని ఒకరికొకరు ఆప్యాయతలను పంచుకుంటూ అందరూ కలిసి వంటలు, ఇతర కార్యక్రమాలను నిర్వహించారు. టిడిఎఫ్ అట్లాంటా కార్యవర్గం చేసిన ఏర్పాట్లను చూసి పలువురు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెద్దలకు, చిన్నారులకు విడివిడిగా ఆటల పోటీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ పిండి వంటలను అందరికీ వడ్డించారు. తెలంగాణ ధూంధాం పేరుతో మ్యూజిక్ షో కూడా జరిగింది. ఫ్యామిలీ అంత్యాక్షరి పోటీలు వంటి ఇతర కార్యక్రమాలు కూడా ఉత్సాహంగా జరిగాయి. గణేష్ తోట, హరీష్ సూదిని, అవినాష్ కల్యాంకర్, శ్రీధర్ నిమ్మ, ప్రమోద్ కాసి, స్వాతి సుదిని ఇతర సభ్యులు ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించారు.













