TDF: ఘనంగా టిడిఎఫ్ సిల్వర్ జూబ్లి వేడుకలు

పలువురికి అవార్డులు, ఆకట్టుకున్న సదస్సులు, చివరిరోజున బోనాల సందడి
తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతి సంప్రదాయాలకు, తెలంగాణ పండుగలైన బోనం, బతుకమ్మలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంతోపాటు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నారైలను ఏకం చేసి రాష్ట్ర అవతరణకు అండగా నిలిచిన తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF) ఇటీవల సిల్వర్ జూబ్లి వేడుకలను ఘనంగా జరుపుకుంది.
కాలిఫోర్నియాలోని మిల్ఫిటాస్ (Milpitas) లో ఉన్న ఇండియా కమ్యూనిటీ సెంటర్ లో ఈ సిల్వర్ జూబ్లి వేడుకలు వైభవంగా జరిగాయి. చైర్మన్ మురళి చింతలపాణి, ప్రెసిడెంట్ శ్రీనివాస్ మణికొండ ఆధ్వర్యంలో ఆగస్టు 8,9,10 తేదీల్లో మూడురోజులపాటు జరిగిన ఈ వేడుకల్లో ఎంతోమంది ప్రముఖులు, టిడిఎఫ్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పలువురు మంత్రులు అభినందన సందేశాలిచ్చారు. ఎమ్మెల్సీ కోదండరామ్ ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా వచ్చారు. తెలంగాణ ఎడ్యుకేషన్ చైర్ పర్సన్ ఆకునూరి మురళీ, రిటైర్డ్ ఐఎఎస్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అమెరికాలో ప్రగతి తెలంగాణం పేరిట టీడీఎఫ్ సిల్వర్‌జూబ్లీ ఉత్సవాలను నిర్వహించారు.
ఆగస్టు 8వ తేదీన బాంక్వెట్ కార్యక్రమంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో వివిధ రంగాల్లో ప్రావీణ్యం చూపించిన పలువురికి అవార్డులను అందజేశారు. టీడీఎఫ్ తరుపున సేవలు అందించిన సీనియర్ నాయకులు టీఆర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, దివేష్ అనిరెడ్డి, చల్లా కవితలను టీడీఎఫ్ టీమ్ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడుతూ స్పెషల్ వీడియోలను ప్రదర్శించారు.అనంతరం టీడీఎఫ్‌కు సంబంధించిన సావనీర్‌ను విడుదల చేశారు.
ఈ వేడుకలకు తెలంగాణ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదందరాంతోపాటు మాజీ ఎంపీ ఆత్మచరణ్ రెడ్డి, శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ డా. కే. శ్రీకర్ రెడ్డి, ఎంవీ ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ ఈ. వెంకటరెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ డా. ఎం.వి. రెడ్డి (రిటైర్డ్ ఐఎఎస్), తదితరులు ఇండియా నుంచి ప్రత్యేకంగా హాజరయ్యారు.
టీడీఎఫ్ 25 వసంతాల వేడుకల ద్వారా తెలంగాణ అభివృద్ధి, వ్యాపారం, సాంకేతిక రంగం, స్టార్టప్ అవకాశాలు, సాంస్కృతిక వారసత్వం వంటి విభిన్న అంశాలపై చర్చలు, ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో పలువురు నిష్ణాతులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
సిల్వర్ జూబ్లి వేడుకల్లో భాగంగా 2వ రోజైన ఆగస్టు 9వ తేదీన ప్రొఫెసర్ జయశంకర్ గారికి హృదయపూర్వకంగా పూలమాలలు వేసి, దీపాలు వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. తెలంగాణ గీతం ఆలపించారు. రంగురంగుల నృత్యాలు మరియు శ్రావ్యమైన పాటలతో నిండిన సాంస్కృతిక కార్యక్రమాలు వచ్చినవారిని ఆకట్టుకున్నాయి.
అధ్యక్షుడు శ్రీనివాస్ మణికొండ ఉత్తేజకరమైన మాటలతో సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు, రాబోయే ఉత్తేజకరమైన రోజుకు నాంది పలికారు. తెలంగాణ ప్రగతికోసం టిడిఎఫ్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని చెప్పారు.
ఈ వేడుకల్లో భాగంగా పలు సదస్సులను నిర్వహించారు. తెలంగాణ బిజినెస్ ఫోరం ఆధ్వర్యంలో ఓ సదస్సు, పొలిటికల్ ఫోరం ఆధ్వర్యంలో, స్టార్టప్ ఫోరం ఆధ్వర్యంలో, సిఇఓ, సిఎఫ్‌ఓ ఫోరం, విజన్ 2050 పేరుతో సదస్సులు జరిగాయి. చివరిరోజున బోనాల ఊరేగింపుతో కార్యక్రమాలు ముగిశాయి. ఈ వేడుకల విజయవంతానికి పలువురు టిడిఎఫ్ నాయకులు కృషి చేశారు. వెంకట్ మారం, డా. భరత్ నారవెట్ల, దివేష్ అనిరెడ్డి, ప్రీతి జొన్నలగడ్డ, శ్రవంత్ పోరెడ్డి, శ్రీని గిలిపెల్లి, స్వాతి సూదిని, రాజ్ గడ్డం, మనోహర్ ఎడ్మ, శ్రీకళ ప్రొద్దుటూరు, మహేంద్ర గూడూరుతోపాటు బోర్డ్ ట్రస్టీలు డా. గోపాల్ రెడ్డిగాదె, ఇందిరాదీక్షిత్, కళ్యాణ్ రెడ్డి గడ్డం, కశ్యపమాదారం, రవి ఎం రెడ్డి, సదానంద్ దోకూరు, విజేందర్ దుంబాల, వినయ తిరిక్కోవలూరుతోపాటు పల్లవి ముస్కుల, శ్రవంతి, సింధి మేకల, కీర్తి గున్న, రష్మి టెల్కల తదితరులు ఈ వేడుకల విజయవంతానికి పాటుపడ్డారు.
అవార్డులు
ఈ వేడుకల్లో భాగంగా పలువురికి అవార్డులను అందజేశారు. జీవితకాలసాఫల్య అవార్డును డాక్టర్ దివేష్ అనిరెడ్డికి, డాక్టర్ గోపాల్ రెడ్డి గాదెకు అందజేశారు. టిడిఎఫ్ లైఫ్ టైమ్ ఫిలాంత్రపీ అవార్డును టి రామచంద్రారెడ్డికి, విజనరీ లీడర్ షిప్ అవార్డును కవితా చల్లాకు అందజేశారు.
రాజేశ్వర్ రెడ్డి మట్ట, మహేంద్ర గూడూరు, ఎం.వి. గోన రెడ్డి, రామ్ కాకులవరం, వినీల్ రెడ్డి అడుడోడ్ల, భవానీ మనుమూర్తి, ఇందిరా దీక్షిత్‌కు కూడా అవార్డులను బహుకరించారు.
విజన్ తెలంగాణ – 2050
తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం సిల్వర్ జూబ్లి వేడుకల్లో భాగంగా తెలంగాణ భవిష్యత్తుపై నిపుణులతో, ప్రముఖులతో ఓ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆగస్టు 9, 2025న జరిగిన ఈ కార్యక్రమంలో విజన్ తెలంగాణ – 2050 పేరుతో స్ఫూర్తిదాయకమైన చర్చా కార్యక్రమం అందరినీ ఆలోచింపజేసేలా సాగింది. ఇందులో పలువురు పాల్గొన్నారు.
పాల్గొన్న వక్తలు…ప్రొ. కోదండరామ్, ఎమ్మెల్సీ, తెలంగాణ, ఆకునూరి మురళీ రిటైర్డ్ ఐఎఎస్, జయంత్ చల్ల – ఎంట్రప్రెన్యూరర్, పిలాంత్రఫిస్ట్, రాజు రెడ్డి, మేనేజింగ్ పార్టనర్, ఎస్‌విక్యూ, ప్రవీణ్ జొన్నలగడ్డ – సిఐఓ, కామ్ స్కోప్, డా. సుజీత్ పున్నం ఎండి, – ఎఫ్ ఎసిసి ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, రిందా సామ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, యూరోమెమ్స్ పాల్గొన్నారు.
ఈ చర్చా కార్యక్రమంలో ముఖ్య అంశాలుగా ఇ సెషన్ పాలన, విద్య, ఆవిష్కరణలు, ఆరోగ్య సంరక్షణ మరియు ఆర్థిక వృద్ధిపై డైనమిక్ ఆలోచనల మార్పిడి వంటివి ఉన్నాయి. ఇవన్నీ 2050 నాటికి బలమైన మరియు స్థిరమైన తెలంగాణను రూపొందించే లక్ష్యంతో వీటిని చర్చాంశాలుగా చేర్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నిష్ణాతులు తెలంగాణ 2050కి కావాల్సిన సూచనలను, సలహాలను తెలియజేశారు. ఇలాంటి అత్యున్నతమైన చర్చాసదస్సును ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఎమ్మెల్సీ కోదండరామ్ అభినందించారు.