టిడిఎఫ్ పోర్ట్లాండ్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్) పోర్ట్లాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో ఒరెగాన్ ఫ్లేట్ పోర్టాండ్ల్ మెట్రో నగరంలో బతుకమ్మ మరియు దసర వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పోర్టాండ్ల్ మెట్రోలో కోవిడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ వేడుకలు జూమ్ వీడియో కాల్ ద్వారా జరిగాయి. టిడిఎఫ్ పోర్ట్ లాండ్ చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల తన ఇంటి నుండి జ్యోతి ప్రజ్వలనతో ఈ వేడుకల్ని ప్రారంభించారు. జూమ్ వీడియో వర్చ్యువల్ బతుకమ్మ అయినా అధిక సంఖ్యలో తెలుగింటి ఆడపడుచులు పిల్లల పాపలతో సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబయి నలువైపులా నుండి ఆటల పాటలతో, కోలాటాల విన్యాసాలతో ఈ పండుగ వేడుకలలో పాల్గొన్నారు. రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, అందరిని ఆనందింప చేసాయి.
అక్టోబర్ 9న జరిగిన ఈ ఉత్సవాలకు పోర్టాండ్ల్ మెట్రో సిటీస్ నుండి అత్యధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ట్రెడిషన్ ఫాలో అవుతూ అట పాట తర్వాత, నిమజ్జనం చేసి వేడుకల్ని విజయవంతం చేసారు. ఈ వేడుకలలో పాల్గొన్న పోర్టాండ్ లో మెట్రో సిటీ వారందరికీ టిడిఎఫ్ పోర్ట్ లాండ్ చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలు వైభవంగా జరగడానికి సహాయపడి విజయవంతం చేసిన మహిళలకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వేడుకలో బతుకమ్మలతో పాల్గొన్న అందరికీ మరియు బతుకమ్మ విజేతలకు బహుమతులు అందజేశారు. వేడుకలకి స్పాన్సర్ చేసిన వారందరికీ శ్రీని అనుమాండ్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జూమ్ మీడియా కాల్ ద్వారా నిర్వహించి విజయవంతం చేసిన టీడీఎఫ్ పోర్ట్లాండ్ సభ్యులు సురేష్ డొంతుల వీరేస్ బుక్క, శ్రీపాద్ రాంభట్ల, అజయ్ అన్నమనేని, రాజ్ అందోల్, మధుకర్ రెడ్డి పురుమాండ్ల కొండల్ రెడ్డి పూర్మ, జయ్ ఆడ్ల, నిరంజన్ కూర, రఘు శ్యామా తో పాటు సహాయం చేసిన అరుణ్ నవీన్, శ్రీనివాస్ మరియు వెంకట్లకు అభినందనలు తెలిపారు. చివరగా టీడీఎఫ్ టీంని పెద్ద ఎత్తున ఆదరిస్తున్నందుకు శ్రీని అనుమాండ్ల సంతోషం వ్యక్త పరుస్తూ పోర్ట్ లాండ్ మెట్రో ఎన్ఆర్ఐలందరికి అభినందనలు తెలుపుతూ వేడుకల్ని ముగించారు.













