న్యూయార్క్ లో తానా యోగా వర్క్ షాప్ సక్సెస్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూయార్క్ లో నిర్వహించిన యోగా, మెడిటేషన్ వర్క్ షాప్ విజయవంతమైంది. మార్చి 1వ తేదీన నిర్వహించిన ఈ వర్క్ షాప్ కు ఎంతోమంది హాజరయ్యారు. యోగా గురు సంజయ్ అత్తాడ ఆధ్వర్యంలో యోగా, మెడిటేషన్ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. అనారోగ్యాన్ని దూరం చేయడంలో యోగా కంటే మంచి మందు లేదన్నారు.
తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి మాట్లాడుతూ, నిత్యజీవితంలో యోగా, మెడిటేషన్‌కు ఎంతో ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. యోగా, మెడిటేషన్ చేయడం వల్ల మన మనస్సుకు, శరీరానికి బహుళ ప్రయోజనాలు కలుగుతుందని, అనారోగ్యం నుంచి బయటపడటంతోపాటు, రోగాలు దరి చేరనీయకుండా చూడవచ్చని చెప్పారు. మానసిక ప్రశాంతత కూడా కలుగుతుందని, ఒత్తిడులు దూరమవుతాయని తెలిపారు.
తానా ఉమెన్స్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల, తానా కమ్యూనిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్ మల్లి వేమన, తానా న్యూయార్క్ రీజినల్ కో ఆర్డినేటర్ సుమంత్ రామ్సెట్టి తదితరులను జయ్ తాళ్ళూరి అభినందిస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించాల్సిందిగా సూచించారు. ఈ వర్క్‌షాప్ విజయవంతానికి కృషి చేసిన అందరికీ తానా టీమ్ ధన్యవాదాలను తెలియజేసింది.













