తానా అధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ పోటీలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్వర్యంలో ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని “తానా” సంస్థ – UNO వారితో కలసి జూన్ 5వ తేదీ నుండి 8 వతేదీ వరకు మూడు రోజులపాటు అంతర్జాలంలో వైవిధ్యకరమైన వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తానా సంస్థ అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి గారు తెలిపారు. ఈ సంవత్సరం ఈ కార్యక్రమానికి “Time for Nature-Celebrate and Protect Biodiversity” ప్రదాన అంశం గా ఉంటుందన్నారు. ఇదే లక్ష్యంతో తానా సంస్థ ఈ కార్యక్రమాలన్నీజరుగుతాయన్నారు.
ఈ కార్యక్రమానికి, శిరీష తునుగుంట్ల, ఉమెన్స్ సర్వీసెస్ కో ఆర్డినేటర్, “తానా” సంస్థ మరియు “జిజ్ఞాస” సంస్థ డైరెక్టర్, భార్గవ గారి పర్యవేక్షణలో జరుగుతుందని అన్నారు. ఎప్పటిలాగే తానా సభ్యులే కాకుండా అందరూ ఈ కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకొని విజయవంతo చేయాలన్నారు.
అందరూ తమ వంతు బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లాలనీ, ప్రస్తుత తరుణ౦లో పర్యావరణ పరిరక్షణ మన జీవితంలో ప్రదాన భాగమైందనీ అందరూ ప్రకృతిని కాపాడుకుంటూ మన భవిష్యత్తు తరాలకు మంచి అలవాట్లు, ఆరోగ్యకరమైన వారసత్వాన్ని అందించాలని పిలుపిచ్చారు.
మూడురోజులపాటు అంతర్జాలంలో జరిగే ఈ కార్యక్రమాల్లో అనేకమంది పర్యావరణ నిపుణులు,సామాజిక కార్యకర్తలు, కళాకారులు పాల్గ్నిని విలువైన చర్చలు, సలహాలతో పాటు ప్రణాలికలుకూడా రూపొందిస్తారన్నారు. ఈ సందర్భంగా జరిగే వివిధ కార్యక్రమాలలో తానా సంస్థ మొట్టమొదటిసారి అన్ని బాషలవారికీ ఆహ్వానం పలుకుతూ అందరూ పాల్గొని వారి వారి బాషాలలోనే వైవిధ్యకరమైన కళారూపాలని ప్రదర్శించవచ్చన్నారు. “ఉమ్మడి లక్ష్యం- ఉమ్మడి బాధ్యత” ఈ కార్యక్రమానికి స్పూర్తి అని అన్నారు.













