ప్రతిభను ప్రోత్సహిస్తున్న తానా… విద్యార్థులకు స్కాలర్ షిప్ లు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫౌండేషన్ ‘‘చేయూత’’ పోగ్రాం ద్వారా కర్నూలుకి చెందిన జయ సాయి, తన్వి శ్రీజలకు నలభై వేల రూపాయల పారితోషికం అందించారు. కరోనా వైరస్ వలన ప్రతిభాపాటవాలు కలిగిన చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వారి కోసం పారితోషికాలు అందిస్తున్నామని తానా కార్యదర్శి పొట్లూరి రవి తెలిపారు. తానా ఫౌండేషన్ కోశాధికారి శశికాంత్ వల్లేపల్లి ఆధ్వర్యంలో చేపడుతున్న ‘‘చేయూత’’ కార్యక్రమం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు వెయ్యి (1000) మందికి పైగా విద్యార్థులకు పారితోషికాలు అందించామని తానా అధ్యక్షులు జయ్ తాళ్ళూరి, ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు తెలిపారు. కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముప్పా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.













