సీఎం ఆదేశిస్తే రాజంపేట నుంచి పోటీ చేస్తా : సతీష్ వేమన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రాజంపేట తెలుగుదేశం పార్టీ నేతల భేటీ ముగిసింది. ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు సతీష్ వేమన మాట్లాడుతూ సీఎం ఆదేశిస్తే రాజంపేట నుంచి పోటీ చేస్తానని ఆయన అన్నారు. రాజంపేట సీటు గెలిపించే ముఖ్యమంత్రి చంద్రబాబుకు కానుకగా ఇస్తామని హామీ ఇచ్చారు. రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకత్వంతో పాటు గ్రామస్థాయిలో పటిష్టమైన క్యాడర్ ఉందన్నారు. తాను విద్యార్థి దశ నుంచి తెలుగుదేశం పార్టీకి వీరాభిమానినన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శిగా పని చేశానన్నారు. తాను రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరపున పనిచేస్తూ ఆ పార్టీ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించానన్నారు. మేడా సస్పెన్షన్ పట్ల కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.













