తానా న్యూ ఇంగ్లండ్ స్వచ్ఛమైన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు శ్రీకారం
తానా న్యూ ఇంగ్లండ్ కొత్తగా ఎన్నికైన ఆర్ఆర్ సోంపల్లి కృష్ణ ప్రసాద్, ఫౌండేషన్ యెండూరి శ్రీనివాస్, స్వచ్ఛమైన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఆదివారం కనెక్టికట్ న్యూలండన్ ప్రాంతం మంచుతో కప్పబడి ఉంది, తానా న్యూ ఇంగ్లండ్ బృందం స్థానిక నిరాశ్రయుల ఆశ్రయంలో 150 మందికి ఆహారాన్ని అందించింది, నిరాశ్రయులైన ప్రజలు ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని తానా న్యూఇంగ్లాండ్ బృందాన్ని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో సోంపల్లి కృష్ణ ప్రసాద్, యెండూరి శ్రీనివాస్, తేజ శర్మ, గోపి నెక్కలపూడి, నరేన్, గీత, ఉమ, పద్మ, రేఖ పాల్గొన్నారు.







