టీవీ5 ఆఫీసును సందర్శించిన తానా నాయకులు
హైదరాబాద్లో ఉన్న టీవీ 5 కార్యాలయాన్ని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు టీవీ 5 చైర్మన్ బి.ఆర్ నాయుడు, ఎండి రవీంద్రనాథ్ను కలిసి తానా చేస్తున్న కార్యక్రమల వివరాలను తెలిపారు. తానా అధ్యక్షులు జే తాళ్ళూరి, మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి, నాదెళ్ళ గంగాధర్, తానా బోర్డ్ చైర్మన్ హరీష్ కోయ, తానా ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, తానా కో ఆర్డినేటర్ తెలుగు టైమ్స్ వైస్ చైర్మన్ ప్రసాద్ గారపాటి, తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు టీవీ 5 కార్యాలయాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు.













