విజయవంతముగా ముగిసిన తానా ఫౌండేషన్ మెగా ఐ క్యాంపు
అంగలూరు, కృష్ణా జిల్లా నందు తానా ఫౌండేషన్, శంకర్ ఐ ఫౌండేషన్ సంయక్తముగా ఏప్రెల్ తొమ్మిదవ (April 9th 2023) తేదీ మెగా ఐ క్యాంపు నిర్వహించడం జరిగినది. సుమారు నాలుగు వందలు పైగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికీ కళ్ళ జోళ్ళు పంచడం జరిగినది. సుమారు డెబ్భై అయిదు కంటి ఆపరేషన్ కొరకు చేయడం జరిగినది. కార్యక్రమానికి హాజరైన గ్రామ పెద్దలు తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ మెగా ఐ క్యాంపు కార్యక్రమం శ్రీ దుగ్గిరాల చిన్నబ్బాయి మరియు శ్రీమతమ్మ జ్ఞాపకార్థం శ్రీమతి శిరీష యలమంచిలి కోలా గారు స్పాన్సర్ చెయ్యడం జరిగినది. తానా ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తమ చౌదరి గుడే ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవహరించారు.













