TANA: కేంద్రమంత్రులు పెమ్మసాని, భూపతిరాజును కలిసిన తానా నాయకులు… మహాసభలకు ఆహ్వానం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) నోవైలో నిర్వహించే తానా 24వ మహాసభలకు రావాల్సిందిగా కేంద్రమంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ (pemmasani chandrasekhar), భూపతిరాజు శ్రీనివాసవర్మ (bupatiraju srinivasa varma) ను తానా నాయకులు కలిసి ఆహ్వానించారు.
తానా కాన్ఫరెన్స్ చైర్మన్ నాదెళ్ళ గంగాధర్, మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంట్ర, పాతూరి నాగభూషణం, చందు గొర్రెపాటి, శశి దొప్పాలపూడి తదితరులు కేంద్రమంత్రులను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా అమెరికాలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను వారు కేంద్రమంత్రులకు వివరించారు. మహాసభల వివరాలను కూడా వారు తెలియజేశారు.







