TANA: తానా మహాసభలు… మంత్రి నారా లోకేశ్‌కు ఆహ్వానం
డిట్రాయిట్‌లోని నోవైలో జూలై 3 నుంచి 5వ తేదీ వరకు జరగనున్న తానా (TANA) 24వ మహాసభలను పురస్కరించుకుని తానా నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ను కలిసి మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వనించారు.
ఈ సందర్భంగా లోకేశ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని, ఆర్థికమాంద్యం వచ్చే ఛాయలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. అలాగే ఇమ్మిగ్రేషన్ విధానాల వల్ల ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు తానా చేస్తున్న సహాయంపై ప్రశ్నించి తెలుసుకున్నారు. అలాగే కార్లపై విధిస్తున్న సుంకాల వల్ల ధరలు పెరిగితే ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందని ఆయన తానా నాయకులను అడిగి తెలుసుకున్నారు.
తానా కాన్ఫరెన్స్ చైర్మన్ గంగాధర్ నాదెళ్ళ, మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి, తానా మహాసభల డైరెక్టర్ సునీల్ పాంట్ర, చందు గొర్రెపాటి, అనిల్ లోకేశ్‌ను కలిసిన వారిలో ఉన్నారు.







