TANA: తానా మహాసభలకు రండి… ఎపి, తెలంగాణ మంత్రులకు తానా నాయకుల ఆహ్వానం
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (TANA) ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే మహాసభలు జులై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవిలోని సబర్బన్ కలెక్షన్ షోప్లేస్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో ఈ మహాసభలకోసం పలువురు రాజకీయ నాయకులను, మంత్రులను, ఇతర ప్రముఖులను తానా నాయకులు స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రపదేశ్ (AP) మంత్రులు పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు, కింజరపు అచ్చన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, బి.సి. జనార్ధన్ రెడ్డి, కొల్లు రవీంద్ర, వయ్యావుల కేశవ్, తదితర మంత్రులతోపాటు ఎంపి సుజనా చౌదరిని, ఎమ్మెల్సీ శ్రీకాంత్ లను కూడా కలిసి తానా మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.
తెలంగాణ (Telangana) రాష్ట్రమంత్రులను కూడా తానా నాయకులు కలిసి మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ తదితర మంత్రులను తానా నాయకులు కలిశారు.
తానా కాన్ఫరెన్స్ చైర్మన్ నాదెళ్ళ గంగాధర్, మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంట్ర, చందు గొర్రెపాటి, శశి దొప్పాలపూడి తదితరులు మంత్రులను ఆహ్వానించినవారిలో ఉన్నారు.







