TANA: న్యూజెర్సీ లో తానా–గ్రేస్ ఫౌండేషన్ 5కే రన్

స్మిత్‌ఫీల్డ్ క్రికెట్ పార్క్‌లో తానా (TANA) మరియు గ్రేస్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన కమ్యూనిటీ 5కే రన్ విజయవంతంగా జరిగింది. కార్యక్రమం ప్రారంభానికి ముందు, తానా బృందం మరియు గ్రేస్ ఫౌండేషన్ బృందం క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించడం, ప్రమాదాన్ని తగ్గించే చర్యలు వంటి అంశాలపై సంక్షిప్త అవగాహన సెషన్ నిర్వహించారు. పాల్గొన్నవారు స్మిత్‌ఫీల్డ్ క్రికెట్ పార్క్‌లో చేరి ఆహ్లాదకరమైన వాతావరణంలో 5కే రన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు జీవనశైలిలో మార్పులు ఎలా చేసుకోవాలన్న విషయంపై అందరూ తమ ఆలోచనలు పంచుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని గ్రేస్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గంగాధర్ సుంకర మరియు తానా రీజినల్ కోఆర్డినేటర్ సుధీర్ చంద్ నరేపలుపు సమన్వయం చేశారు. న్యూజెర్సీ మరియు పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది పాల్గొన్నారు. వారితో పాటు యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ చెరుకూరి, మాజీ తానా ఫౌండేషన్ కార్యదర్శి విద్య గారపాటి, దశరధ్, రామకృష్ణ వాసిరెడ్డి తదితరులు హాజరయ్యారు.
కార్యక్రమాన్ని సమన్వయం చేసి పాల్గొన్న అందరినీ తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, కొశాధికారి రాజా కసుకుర్తి హృదయపూర్వకంగా అభినందించారు.