గంపలగూడెం లో తానా ఉచిత కంటి వైద్య శిబిరం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభ్యులు, గంపలగూడెం కు చెందిన కఠారు నెహ్రూ గారు వారి తండ్రి కీ.శే. కఠారు పార్ధసారధి గారి జ్ఞాపకార్ధం నిర్వహించిన ఉచిత కంటివైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. ఈ శిబిరంలో 175 మందికి వైద్య పరీక్షలు నిర్వహించటం జరిగింది. వీరిలో 90 మందికి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. అందరికి గుంటూరు లోని శంకర ఐ హాస్పిటల్ లో ఉచితంగా ఆపరేషన్ చెయ్యబడునని వైద్యులు తెలిపారు.
తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి గారు, తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ గారు, తానా ఫౌండేషన్ ట్రస్టీ రాంశెట్టి సుమంత్ గారు మరియు తానా కల్చరల్ సర్వీసెస్ కోఆర్డినేటర్ శ్రీమతి తూనుగుంట్ల శిరీష గార్ల సహకారంతో, గుంటూరు జిల్లా పెదకాకాని లోని శంకర్ కంటి వైద్యశాల సంయుక్తంగా గంపలగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఈ శిబిరం నిర్వహించారు.
గంపలగూడెం నివాసి కొల్లా హరిప్రసాద్ గారి పర్యవేక్షణలో, జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యం మరియు, కఠారు కోటేశ్వరరావు గార్ల సహకారంతో కంటివైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడినది.













