ఛార్లెట్ లో తానా బ్యాక్‌ప్యాక్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో అమెరికాలోని పేద పిల్లలకు బ్యాక్‌ప్యాక్ పథకం కింద స్కూల్ బ్యాగ్‌ల పంపిణీ కార్యక్రమం వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఛార్లెట్‌లో కూడా ఈ కార్యక్రమాన్ని ఇటీవల నిర్వహించారు. ఛార్లెట్‌లోని జె.హెచ్ ఎలిమెంటరీ స్కూల్లో తానా బ్యాక్‌ప్యాక్ కార్యక్రమాన్ని నిర్వహించి స్కూల్ పిల్లలకు బ్యాగ్‌లను, కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో తానా కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్ మల్లివేమన, అప్పలాచియాన్ రీజినల్ కో ఆర్డినేటర్ సురేష్ కాకర్ల, తానా బ్యాక్‌ప్యాక్ చైర్ సత్యనారాయణ మన్నె సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. టాగూర్ మలినేని, అన్నె రమణ, పార్థ, నాగ పంచుమర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.













