TANA: న్యూ ఇంగ్లాండ్ లో తానా కళాశాల పరీక్షలు విజయవంతం

అమెరికా దేశవ్యాప్తముగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) వారి కళాశాల పరీక్షలు న్యూ ఇంగ్లాండ్ లో కూడా విజయవంతుముగా పూర్తి చేసారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (ఎస్.పి.ఎం.వి.వి) సహకారంతో కూచిపూడి, భరతనాట్యం, కర్ణాటక గాత్రం మరియు వీణలలో వివిధ స్థాయిలలో తరగతులను నిర్వహించి వార్షిక థియరీ మరియు ప్రాక్టికల్ పరీక్షలను తానా కళాశాల ద్వారా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తీర్ణులైన వారికి డిప్లొమాలు అందిస్తోంది. స్థానికంగా ఉన్న కళాకారులు తానా కళాశాల ద్వారా తమ కళను మెరుగుపరుచుకునే అవకాశం ఈ కళాశాల ద్వారా లభించింది. ఎస్.పి.ఎం.వి.వి విశ్వవిద్యాలయం మార్గదర్శకాల ప్రకారం తానా కళాశాల బృందం న్యూ ఇంగ్లాండ్‌లోని బోస్టన్ లో ప్రాక్టికల్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. కూచిపూడి, భరతనాట్యం, కర్ణాటక సంగీతంలో కళాశాల వారు నిర్వహిస్తున్న ఈ కోర్సులకు అమెరికా అంతటా ప్రాచుర్యం వుంది.
తానా కళాశాల చైర్మన్ శ్రీమతి మాలతీ, తానా ప్రెసిడెంట్ డాక్టర్ నరేన్ కొడాలి కళాశాల పరీక్షా విధానము లో మార్పులు అన్ని తరగతులు వారినిప్రేరణ కలిగిస్తున్నాయి అని సంతృప్తి వ్యక్తపరిచారు.
తానా న్యూ ఇంగ్లాండ్ రీజినల్ కోఆర్డినేటర్ మౌనిక మానికొండ ఆధ్వర్యములో నిర్వహించిన కళాశాల పరీక్షలకు ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ కృష్ణ ప్రసాద్ సోంపల్లి ఇన్విజిలేటర్ గా వ్యవహరించారు, మన సంప్రదాయాలు పెంపొందిస్తున్న తానా కళాశాల ప్రోగ్రాం అందరికి స్ఫూర్తిదాయకం అని విన్నవించారు. శైలజ ఈడుపుగంటి ఉపాధ్యాయురాలుగా, తానా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ ఎండూరి ఈ తానా న్యూ ఇంగ్లాండ్ బోస్టన్ కళాశాలలో ఇద్దరు డాక్టర్లు విద్యార్థులుగా ఉండటము ఈ కార్యక్రమం విశిష్టతను తెలియజేస్తోందన్నారు. తానా చేపట్టిన కార్యక్రమాల్లో మన సంప్రదాయాలను పెంపొందిస్తున్న ఈ కళాశాల కార్యక్రమము అగ్రస్థానుములో వుంది అని వ్యాఖ్యానించారు. చివరిగా ఈ కార్యక్రమానికి తానా న్యూ ఇంగ్లాండ్ ఆరు రాష్ట్రాలు నుంచి వచ్చిన విద్యార్థులు అందరకి తానా న్యూ ఇంగ్లాండ్ రీజినల్ కోఆర్డినేటర్ మౌనిక మానికొండ కృతజ్ఞతలు తెలిపారు.