ప్రతిభావంతులకు తానా ‘చేయూత’
చదువులో మెరుగైన ప్రతిభను కనబరుస్తున్న పేద, అనాథ విద్యార్థులకు, ఉన్నత విద్య చదవడంలో ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న విద్యార్థులకోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ఫౌండేషన్ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘తానా చేయూత’ పేరుతో నిర్వహిస్తున్న ఈ పథకం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో చదువులో రాణిస్తున్న అనాథ, పేదింటి పిల్లల విద్యాభ్యాసానికి తగిన ఆర్థిక సహాయాన్ని అందించేందుకు వీలుగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తానా పేర్కొంది. దాతలు ఎవరైనా తమకు తెలిసిన విద్యార్థి చదువుకోసం తానా ద్వారా కాని, లేదా స్వయంగా కాని ఈ పథకం ద్వారా చేయూతను అందించవచ్చు. ఈ పథకం కోసం తానా ఫౌండేషన్‌కు విరాళం ఇచ్చిన దాతలకు 501సి (3) కింద ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుందని తానా ఫౌండేషన్ పేర్కొంది. ఇతర వివరాలకు ఫ్లయర్‌ను చూడవచ్చు.













