విజయవాడలో కరోనా సాయం అందించిన తానా-భక్త భల్లా మిత్రుల బృందం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ఫౌండేషన్ ట్రస్టీ భక్త భల్లా, ఆయన మిత్రులు కలిసి కరోనా సంక్షోభంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విజయవాడ ఆటోనగర్ బలహీన వర్గాలకు, రిక్షా కార్మికులకు, డ్రైనేజీ, పారిశుద్ధ్య కార్మికులకు చెందిన 150కుటుంబాలకు కూరగాయలు, సరకులు, ఆర్థిక సాయాన్ని అందజేశారు. SJMIT పూర్వ విద్యార్థుల సంఘ సభ్యులు తానా తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రైతుల వద్ద నుండి నేరుగా కొనుగోలు చేసిన నాణ్యమైన కూరగాయలను ఈ సందర్భంగా కరోనా బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని అట్లూరి శ్రీనివాసరావు, రామ్మోహనరావు, ఉమామహేశ్వరరావు, కిషోర్, జాస్తి సాంబశివరావు తదితరులు సమన్వయపరిచారు.






