తానా ఇండియా కిక్ ఆఫ్ ఈవెంట్ 17 న

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫిలడెల్ఫియాలో 2023 జూలై 7వ తేదీ నుంచి 9వరకు నిర్వహించనున్న తానా మహాసభల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ఇండియాలో కూడా కిక్ ఆఫ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని దస్‌పల్లా హోటల్‌లో డిసెంబర్ 17వ తేదీన ఈ కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా తానా మహాసభల లోగోను ఆవిష్కరిస్తున్నట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కో ఆర్డినేటర్ రవి పొట్లూరి తెలిపారు. తానా 2023 కాన్ఫరెన్స్ ప్రొమోను కూడా ఆవిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సినీనటుడు మురళీ మోహన్ హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ, క్రీడ, బిజినెస్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరవుతున్నారని వారు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా వారు కోరారు.