TAMA: ఘనంగా తామా దీపావళి వేడుకలు
మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (TAMA) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను వైభవంగా నిర్వహించారు. నవంబర్ 8వ తేదీన కమ్మింగ్ లోని దేశాన మిడిల్ స్కూల్ లో ఆనందోత్సవాల మధ్య ఈ వేడుకలు జరిగాయి. పార్వతి కొంపెల్ల, బిగ్ బాస్ ఫేమ్ అరియనా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ వేడుకలకు ప్రధాన ఆకర్షణగా గీత మాధురి హనుమాన్ సంయుక్తంగా సంగీత విభావరిలో టపాసులు, చిచ్చుబుడ్డి లాంటి వివిధ రకాల పాటలు పాడి అలరించారు. ఈ పాటలకు అనుగుణంగా అరియనా సత్య మాస్టర్ లు ఆహూతులచే నృత్యాలు కూడా చేయించారు.
ఈ వేడుకల్లో భాగంగా 12 వ తరగతి పిల్లల కొరకు మ్యాథ్ బౌల్ పోటీలను నిర్వహించారు. విజేతలకు బాబ్ ఎర్రమిల్లి జాన్స్ క్రీక్ సిటీ కౌన్సిల్ సభ్యుడు చేతులమీదుగా బహుమతులను అందజేశారు. జాన్స్ క్రీక్ సిటీ కౌన్సిల్ మరొక సభ్యుడు దిలీప్ తుంకి కూడా ఈ వేడుకలో పాలుపంచుకొన్నారు. ఈ సందర్భంగా తామా వారు శ్రీ శ్రీనివాస రాయపురెడ్డి మెమోరియల్ అవార్డును ఈ సంవత్సరపు స్వచ్చంద సేవకుడిగా ఎంపికైన ఫణింద్ర జమ్ముల గారికి అలాగే డాక్టర్ శ్రీహరి మాలెంపాటి మెమోరియల్ అవార్డును ఈ సంవత్సరపు క్లినిక్ స్వచ్చంద సేవకుడిగా ఎంపికైన కింటూ షాగారికి బహూకరించడం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా మగవారితో ఫాషన్ షో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాఫెల్ టికెట్స్ విజేతలకు మొదటి బహుమతిగా రోబోటిక్ వాక్క్యూమ్ క్లీనర్ ను రెండవ బహుమతి గా 50ఁ టీవీ ను ఇవ్వడం జరిగింది. వచ్చిన వారందరికీ డబ్బావాలా రెస్టారెంట్ వారు అందించిన రుచికరమైన విందు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమానికి ప్లాటినం స్పాన్సర్ గా దేశి డిస్ట్రిక్ట్, గోల్డ్ స్పాన్సర్ గా శేఖర్ రియాల్టీ, వేలా -వెంకట్ అడుసుమిల్లి, కాకతీయ ఇండియన్ కిచెన్, పటేల్ బ్రదర్స్, డబ్బా వాలా, రియల్ టాక్స్ అల్లీ, ట్రూ వ్యూ, కెడ్స్, చెస్ ట్రానిక్స్ తదితరులు స్పాన్సర్లుగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసిన తామా అధ్యక్షులు రుపేంద్ర వేములపల్లి, బోర్డు చైర్మన్ రాఘవ తడవర్తి, వారికి తమవంతు సహాయం చేసిన స్వచ్చంద సేవకులు, కార్యనిర్వాహక బృందం, బోర్డు బృందం అందరికీ స్ఫూర్తినిచ్చేలా నిలిచింది. అందరికీ సంఘం అధ్యక్షులు మరియు బోర్డు చైర్మన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సునీత పొట్నూరు (ప్రెసిడెంట్ ఎలెక్ట్), ప్రధాన కార్యదర్శి: తిరుమల రావు చిల్లపల్లి, కోశాధికారి: సునీల్ దేవరపల్లి, సాంకేతిక కార్యదర్శి: చలమయ్య బచ్చు, సాహిత్య కార్యదర్శి: శ్రీనివాస్ రామనాధం, విద్యా కార్యదర్శి: ముఖర్జీ వేములపల్లి, కమ్యూనిటీ కార్యదర్శి: కృష్ణ ఇనపకుతిక, ఈవెంట్స్ కార్యదర్శి: శేఖర్ కొల్లు, మహిళా కార్యదర్శి: పార్వతి కొంపెల్ల, క్రీడల కార్యదర్శి: సురేష్ యాదగిరి, బోర్డు సభ్యులు: సాయిరాం కారుమంచి, యశ్వంత్ జొన్నలగడ్డ, రాంకీ చౌడారపు, వెంకట తెరల, శ్రీనివాస్ ఉప్పు, తామా పూర్వ అధ్యక్షులు: సురేష్ బండారు, సంస్థ శ్రేయోభిలాషులు: శ్రీనివాస్ లావు, అంజయ్య లావు, వినయ్ మద్దినేని, భరత్ మద్దినేని, మధుకర్ యార్లగడ్డ మొదలగు వారు అందరూ పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు.






