మార్నింగ్ వాక్‌తో అల్జీమర్స్ రాక వాయిదా
మార్నింగ్ వాక్‌లో కాస్త చురుకుదనం పెంచడం ద్వారా అల్జీమర్స్ వచ్చే ముప్పును నెమ్మదింపజేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఉదయమూ, సాయంత్రమా అన్న తేడా ఏమీ లేదని, నడకలో కాస్త వేగం పెంచితే సరిపోతుందని వివరించారు. ఇదొక్కటే కాదు, శారీరక శ్రమను పెంచే ఏ కార్యక్రమమైనా ఇదే ఫలితాన్ని అందుకోవచ్చని తెలిపారు. ఆల్జీమర్స్ ముప్పు పొంచి ఉన్న వారిపైనా ఈ విధానం ప్రభావం చూపుతుందని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ మేరకు అల్జీమ్ర్స్ బాధితుల పిల్లలు 93 మందిపై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైందని తెలిపారు.













