టిఎజిసి ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ పోటీలు

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ పోటీలను ఏర్పాటు చేశారు. మే 16వ తేదీన ఈ పోటీలు జరుగుతాయి. ఇల్లినాయిలోని బొలింగ్‍బ్రూక్‍లో ఉన్న పయనీర్ బ్యాడ్మింటన్‍లో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. సింగిల్స్, డబుల్స్ విభాగంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. యూత్ గ్రూపులో 10 నుంచి 18 వయస్సుల వారికి, అడల్ట్ గ్రూపులో 18పైన వయస్సు ఉన్నవారికి పోటీలను ఏర్పాటు చేశారు. ఇతర వివరాలకోసం వీరిని సంప్రదించవచ్చు.
శ్రీధర్ – 630 802 9327, శివ 847 220 2326.