వేదాల సాక్షిగా సంస్కృతంలో అధ్యక్షుడి ప్రమాణస్వీకారం

నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రికాప్రసాద్ సంతోకీ నోట వేదాల సాక్షిగా సంస్కృతంలో ప్రమాణం చేశారు. దక్షిణా అమెరికాలోని సురినమే దేశంలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి ప్రధాని మోదీ కూడా ప్రస్తావించడం విశేషం. పురోహితుడు చెబుతున్న సంస్కృత శ్లోకాలను చంద్రికా ప్రసాద్ పలుకుతూ ప్రమాణం చేయడం ఈ వీడియోలో గమనించవచ్చు. చంద్రికా ప్రసాద్ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కావడం, అందులోనూ హిందువు కావడం వల్లనే ఈ విధంగా హిందూ సంప్రదాయంలో ప్రమాణ స్వీకారం చేసినట్లు తెలుస్తోంది.
On 16th July Shri. Chan Santokhi of Indian origin took oath as #PresidentRepublicOfSuriname, with Holy Vedas in his hands & chant of Sanskrit Mantras by the priests. Best wishes. Congratulations & best wishes! pic.twitter.com/uhTuuYgfMH
— Narendra Sawaikar नरेंद्र सावईकर (@NSawaikar) July 22, 2020











































































