కంప్యూటర్ దిగ్గజం అర్నాల్డ్ స్పీల్బర్గ్ ఇక లేరు
వ్యక్తిగత కంప్యూటర్లు (పీసీ) అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ పరిశోధకుడు ఆర్నాల్డ్ స్పీల్బర్గ్(103) కన్నుమూశారు. హాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్(73)కు ఆయన తండ్రి. కుటుంబసభ్యుల సమక్షంలో ఆయన ప్రశాంతంగా కన్నుమూశారని స్పీల్బర్గ్ కుటుంబం ఒక ప్రకటనలో వెల్లడించింది. 1950వ దశకంలో జనరల్ ఎలక్ట్రిక్ సంస్థలో పనిచేస్తున్న సమయంలో తన సహచరుడు చార్లస్ ప్రాప్స్టర్తో కలిసి స్పీల్బర్గ్ జీఈ-225 మెయిన్‌ఫ్రేమ్ కంప్యూటర్ను రూపొందించారు. దీని స్ఫూర్తితోనే డార్ట్మౌత్ కళాశాలలోని పరిశోధకులు బేసిక్ అనే పొగ్రామింగ్ లాంగ్వేజ్‌ను అభివృద్ధి చేశారు. అనంతరం ఆ లాంగ్వేజ్ సాయంతో 1970, 80లలో పీసీలు వాడకంలోకి వచ్చాయి. 1917లో అమెరికాలోని సిన్సినాటిలో జన్మించిన ఆర్నాల్డ్ 9 ఏళ్లకే క్రిస్టల్ రేడియోను, 15 ఏళ్లకు హోమ్ రేడియోను రూపొందించారు.













