మెగా సేల్ ఆఫర్ ప్రకటించిన స్పైస్ జెట్
దేశీయంగా స్వల్ప దూరాల ప్రయాణాలకు సంబంధించి ఎంపిక చేసిన రూట్లలో రూ.899కే టికెట్ (అన్నీ కలిపి) సేల్ ప్రకటించింది. నాలుగు రోజుల పాటు ఈ మెగా సేల్ ఉంటుందని వెల్లడించింది. ఈ ఆఫర్ కింద గంట పైగా ఉండే ప్రయాణాలకు వన్ వే చార్జీలు అతి తక్కువగా కిలోమీటరుకు రూ.1.75 స్థాయిలో ఉంటాయని తెలిపింది. ఎంపిక చేసిన అంతర్జాతీయ రూట్లలో కిలోమీటరకు రూ.2.5 మాత్రమే చార్జీ అవుతుందని పేర్కొంది. సెప్టెంబర్ 25 దాకా ప్రయాణాలకు ఈ ఆఫర్ కింద టికెట్లు తీసుకొవచ్చు. ఫిబ్రవరి 9 దాకా ఆఫర్ ఉంటుంది. అత్యంత స్వల్ప దూరాలైన కొచ్చి-బెంగళూరు, హుబ్లి-బెంగళూరు వంటి రూట్లలో వన్ వే చార్జీలు రూ.899 నుంచి ప్రారంభమవుతాయి. అదే ముంబై-కొచ్చి వంటి రూట్లలో రూ.1,849 నుంచి చార్జీ ఉంటుంది. అంతర్జాతీయ రూట్లలో మదురై-దుబాయ్ రూట్లో టికెట్ చార్జీలు రూ.3,699 నుంచి ప్రారంభమవుతాయి.













