అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డుపై ప్రత్యేక ఆఫర్
ప్రపంచంలో అత్యధికంగా వినియోగమవుతున్న అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డు మొబైల్ కొనుగోలుదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. దేశంలోని అన్ని ఫోన్ల స్టోర్లలో ఈ ఆఫర్ మార్చి 31 వరకూ అమలులో ఉంటుందని తెలిపింది. ఈ ఆఫర్లు రిలయన్స్ డిజిటల్, క్రోమా ఇలా అన్ని మొబైల్ స్టోర్లలో లభిస్తాయని పేర్కొంది. కార్డు వినియోగదారులు ఐఫోన్ ఎక్స్ప్రెస్ మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఆర్లలో వేటినైనా కొనుగోలు చేసి 10 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చని అమెరికన్ ఎక్స్ప్రెస్ వెల్లడించింది.













