హిందూ సంప్రదాయల్లో అత్యంత కీలకమైన దానిపై నిషేధం దిశగా అమెరికా
హిందూ సంప్రదాయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన వాటిలో ఒకటి సిందూరం. సంప్రదాయ వేడుకలు, ఆలయాల్లో వీటికి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. బొట్టును పెట్టుకోవడం హిందూ మహిళల జీవన విధానంలో ఓ భాగం. సిందూరాన్ని హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అయితే, సిందూరాన్ని పెట్టుకోవడం వల్ల చిన్న పిల్లల్లో ఐక్యూ స్థాయిలు పడిపోతున్నాయని అమెరికాలోని రట్గర్స్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. సిందూరంలో స్వల్ప మోతాదులో సీసం ఉన్నట్లు పరిశోధనలో తేలిందని వారు తెలిపారు. భారత్, అమెరికా నుంచి సేకరించిన గ్రాము సిందూరంలో కనీసం ఒక మైక్రోగ్రాము సీసం ఉన్నట్లు వారు గుర్తించారు. సీసం కలిపిన సిందూరాన్ని వాడడం ఎంత మాత్రం మంచిది కాదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నేపథ్యంలో, అమెరికాకు సిందూరాన్ని తీసుకురావడాన్ని అమ్మడాని నిషేధించాలని వారు ఎఫ్డీఏకు సిఫారసు చేయనున్నారు. మెదడులోని కొన్ని కణాలను సీసం నిర్వర్యం చేస్తుందని వారు హెచ్చరించారు. దక్షిణాసియా వ్యక్తుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనబడ్డాయని చెప్పారు.













