సిమి ఇండియా కమ్యూనిటీ సెంటర్ లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం
గత 3 సంవత్సరాలుగా సిమి వ్యాలీ పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగు కుటుంబాలు కలిసి చేసుకొంటున్న సామూహిక శ్రీసీతారాముల వారి కళ్యాణం ఈ ఆదివారం ఆద్యంతం కమనీయంగా, కన్నుల పండుగగా జరిగింది. సిమి ఇండియా కమ్యూనిటీ సెంటర్ లో జరిగిన ఈ ఉత్సవం భద్రాచల రాముల వారి కళ్యాణం ను తలపించింది. ఈ సామూహిక కళ్యాణం, ఏ ఆర్గనైజషన్స్ తో మరియు టెంపుల్స్ తో సంబంధం లేకుండా, రెండు తెలుగు రాష్ట్రాల నుండి వొచ్చి ఇక్కడ నివసిస్తున్న తెలుగు కుటుంబాల వారు కలిసి చేసుకోవడం విశేషం.
ఉదయం 8 కి ఊరేగింపుతో ప్రారంభం అయిన ఈ కార్యక్రమం మధ్యాహ్నం పెళ్లి విందు భోజనంతో ముగిసింది. భద్రాచలంలో ప్రత్యేక పూజలు చేయించుకొని అమెరికాకి చేరుకొన్న ఉత్సవమూర్తులతో మేళాతాళాల సాక్షిగా ఆడపడుచులు కోలాటంతో సాగిన ఊరేగింపు అందరి మనసులని ఆకట్టుకొంది. దాదాపు 45 మంది తెలుగు ఆడపడుచులు చేసిన కోలాటం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగ నిలచింది.
అందంగా అలంకరించుకున్న రాముల వారిని, లక్ష్మణుల వారిని, హనుమంతుల వారిని, పట్టాభిషేక పాదుకలని మగవారు అందరు వేడుకతో పెళ్లి మంటపానికి ఊరేగింపుగా తీసుకొని రాగ, ఆడపడుచులు ముందుండి చేసిన కోలాటంతో ఊరేగింపు రమణీయంగా సాగింది. గోవింద నామాలు, రామ నామాలతో ప్రాంగణమంతా మార్మోగిపోయింది. ఊరేగింపులో పాల్గొన్న వారి అందరికి తిరుమల వీధులలో జరిగిన ఊరేగింపులో పాల్గొన్న భక్తి భావనలో మునిగిపోయారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అందరు సాంప్రదాయ వస్త్రధారణలో వొచ్చి కల్యాణానికి మరింత శోభను జత చేసారు. శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఆద్యంతం కమనీయంగా జరిగింది. 700 మందికి పైగా భక్తులు కల్యాణాన్ని వీక్షించి పరవశించి పోయారు. 70 కి పైగా జంటలు సామూహిక కళ్యాణంలో భాగస్వామ్యులు అయ్యారు. ముహూర్త సమయానికి, 81 మంది ఆడపడుచుల హారతుల మధ్య మేన -మామల చేతుల మీదుగా సీతమ్మ వారు ళ్లి మంటపానికి చేరుకున్నారు. సుముహుర్త సమయాన, రాముల వారికి, సీతమ్మ వారికి జీలకర్ర బెల్లం పెట్టారు. రాముల వారికి, సీతమ్మ వారికి, భక్తులందరూ కలిసి పట్టు వస్త్రాలు, బంగారు తాళి బొట్టు, మట్టెలు, ఆభరణాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించుకొని తమ భక్తిని చాటుకొన్నారు.
కళ్యాణం జరుగుతున్నంతసేపు, విజయ కూనపల్లి , హైమ గార్ల 40 మంది సంగీత విద్యార్థులు ఆలపించిన రాముల వారి కీర్తనలు అందరిని అలరింప చేసాయి. దానితో పాటు, ప్రసాద్ రాణి గారు చేసిన వ్యాఖ్యానం పలువురికి భద్రాచలంలో జరిగే సీతారాముల వారి కళ్యాణంని తలపించాయి.
దాదాపు 4 గంటలు పైగా జరిగిన ఈ కళ్యాణాన్ని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు కలిసి ఆనందంగా జరుపుకున్నారు. కళ్యాణం సమయంలో పాల్గొన్న భక్తులందరూ కలిసి హనుమాన్ చాలీసా, నామ రామాయణం, గోవింద నామాలు పఠించటంతో భక్తి భావాలూ వెల్లివిరిచాయి. ఎంతో అద్భుతంగా జరిగిన ఈ కళ్యాణం, గ్రాండ్ బావార్చి వారి పెళ్లి విందు భోజనం తో ముగిసింది.
నిర్వాహకులు రామ్ కోడితాలా , చందు నంగినేని, మనోహర్ ఎడ్మ, కుమార్ తాలింకి మాట్లాడుతూ, చిన్నప్పుడు రాముల వారి పందిరిలో ఆడుకున్న అనుభవాలు, సహ పంక్తి భోజనాలు, ఆ పండుగ వాతావరణం మళ్ళి జ్ఞప్తికి తెచ్చేలా, మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ముందు తరాల వారికి నేర్పించేలా, గత 3 సంవత్సరాలుగా ఈ కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్క వాలంటీర్ కి , వొచ్చిన భక్తులందరికీ, దాతలకి ధన్యవాదాలు తెలుపుతూ , మహా నైవేద్యంలో సహకరించిన లీల, బిందు, శిరీష , విజయ గార్ల బృందానికి, మాలలు చేసిన రూప గారికి , అద్భుతంగా పందిరిని అలంకరించిన నీలిమ గారి బృందానికి, భోజనాదులలో ఇబ్బందులు రాకుండా చూసుకున్న సుధీర్ పెండేకంటి, కిషోర్ గరికపాటి, సునీల్ పాతకమూరి, సుధీర్ కోనేరు గార్ల బృందానికి, పూజ సామాగ్రి తో సాయం చేసిన సారధి గోలే, దొరబాబు కొత్తూరు గారి బృందానికి కళ్యాణం ఆద్యంతం రామ కీర్తనలతో అలరించిన శ్రీమతి విజయ, హైమ మరియు ప్రసాద్ రాణి గార్ల బృందానికి, కోలాటం తో అలరించిన శ్రీమతి లతా తాలింకి గార్ల బృందానికి, ఆడియో, ఫోటో లో సహాయం అందించిన నాగరాజు బూదిరాజు, అజిత్ బుర్ర, వీరబాబు గారు, మీడియా కోఆర్డినేటర్ ప్రసూనా బాసని గార్లకి, మిగతా వాలంటీర్స్, అనిత తోటపల్లి, అను ఓరుగంటి, అనూష సాగి, బిందు గండే, బిందు పోలవరపు, కావేరీ గూడా, చంద్రముఖి నిమ్మగడ్డ, దీప్తి పాతకమూరి , దీప్తి చిరుత, గాయత్రి, గిరిధర్ నక్కలా, హరిణి కాల్వల, హర్షదా మాదిరాజు, కిషోర్ రామదేను, కృష్ణ చిరుత, లక్ష్మి పెదిరెడ్డి, లక్ష్మి పడాల, లీల ఆగిన, మూర్తి నేమాని, నాగభూషణం, నాగరాజు బుద్ధిరాజు, నీలిమ టంగుటూరి, పద్మ నేల, ఫణికాంత్, పుష్ప జయరాం, రాజ్ అడపా, రాజ్ గండే, రాజేష్ పెద్దిరెడ్డి, రామ గార్లపల్లి, సాయి మగాగడలా, సాయి వంకినేని, శైలజ మద్దాలి, సంతోష్ ఘంటారాం, సవిత దేవరెడ్డి, శిరీష కోడితాలా, శోభా కల్వకోట, శ్రావణి గొడిశాల, సిద్దు యాదల్లా, శిరీష గాజుల, శిరీష పొట్లూరి, శ్రవణ్, శ్రీదేవి రామదేను, శ్రీకాంత్ బండ్లమూడి, శ్రీలత తాలింకి, శ్రీనివాస్ సంపంగి, శ్రీరామ్ పడాల, సుచరిత అదేమా, సుధా దావులూరి, సుజాత కార్తికేయన్, సుమిత్ర హోసబెట్టు, సునీత పెండేకంటి, సునీత వేదాంతం, సునీత బొప్పిడి, స్వప్న పోపూరి, స్వాతి ఘంటారం, స్వాతి కుప్పిలి, ఉషశ్రీ తేజోమూర్తుల, వెంకట్ ఓరుగంటి, వెంకట నాగ, మరియు ఇతర వాలంటీర్స్ అందరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
వీరు చేసిన ఈ ప్రయత్నాన్ని అందరు ముక్త కంఠంతో అభినందించారు. ఇలాంటి కళ్యాణం ప్రతి సంవత్సరం చెయ్యడంలో నిర్వాహకులకు తమ అండదండలు తప్పక ఉంటాయని వొచ్చిన ప్రతి ఒక్కరు హామీనిచ్చారు.
శాస్త్రోస్తంగా ఘనంగా పూజ నిర్వహించిన పండిట్ శ్రీమార్తాండ శర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, ఆ దంపతులిరువుర్ని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.













