21న న్యూజెర్సిలో అన్నమాచార్యుల జయంతి వేడుకలు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని తన కీర్తనలతో కొలిచిన భక్తుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 610వ జయంతి వేడుకలను న్యూజెర్సిలో ఏప్రిల్ 21వ తేదీన నిర్వహించనున్నారు. సిలికానాంధ్ర ఆధ్వర్యంలో జరిగే 610 వ జయంతి ఉత్సవం, న్యూజెర్సీ లోని బ్రిడ్జివాటర్ బాలాజీ టెంపుల్ నందు కన్నులపండువగా జరగనున్నది. ఆరోజు శ్రీ అన్నమాచార్యులవారి సంకీర్తనలతో సంగీత మరియు నత్య పోటీలను రీజియన్ స్థాయిలో వివిధ వయస్సుల వారికి నిర్వహిస్తున్నారు. ఇందులో గెలుపొందిన వారు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారు.
వివరాలు annamayya.siliconandhra.org నుంచి పొందగలరు. అదే రోజు సాయంత్రం 5 గంటలనుండి 9 గంటల వరకూ పద్మ సుగవనం గారిచే అద్భుత సంగీత కచేరి మరియు వివిధ కళాశాలల నుంచి న త్య ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు.













