Sankara Nethralaya USA: అట్లాంటాలో శంకర నేత్రాలయ ‘మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్’
అమెరికాలోని కమింగ్ (Cumming) నగరంలోని వెస్ట్ ఫోర్సిత్ హైస్కూల్లో శంకర నేత్రాలయ యూఎస్ఏ (Sankara Nethralaya USA) అట్లాంటా చాప్టర్ ఆధ్వర్యంలో ‘మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్’ (Music & Dance for Vision) గ్రాండ్ ఫినాలే కార్యక్రమం ఘనంగా జరిగింది. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) సేవలను విస్తరించాలనే లక్ష్యంతో నవంబర్ 30న ఈ సాంస్కృతిక వేడుకను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అట్లాంటాలోని భారత కాన్సుల్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నివారించదగిన అంధత్వాన్ని రూపుమాపేందుకు శంకర నేత్రాలయ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఆయనను శంకర నేత్రాలయ యూఎస్ఏ (Sankara Nethralaya) గౌరవ బోర్డు సలహాదారుగా ప్రకటించారు. సంస్థ అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి నేతృత్వంలో జరిగిన ఈ ఫండ్రైజర్కు దాతల నుంచి విశేష స్పందన లభించింది. సుమారు 130 మంది ‘అడాప్ట్-ఎ-విలేజ్’ (Adopt-a-Village) స్పాన్సర్లు, ఇతర దాతల సహకారంతో ఈ ఈవెంట్ ద్వారా ఏకంగా 1.625 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 13 కోట్లు) సేకరించడం (Sankara Nethralaya) విశేషం. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో 130 ఎఈఎస్యూ (MESU) కంటి శిబిరాలను నిర్వహించి, వేలాది మంది పేదలకు ఉచితంగా కంటి చూపును ప్రసాదించనున్నారు. ఈ కార్యక్రమంలో అట్లాంటాలోని ప్రముఖ నృత్య, సంగీత పాఠశాలల విద్యార్థులు ప్రదర్శనలతో అలరించారు.






